*తెలంగాణా బతుకమ్మ పాట*
*********************
బతుకూ బతుకూల బొమ్మ , బంగారు ముద్దుల గుమ్మ
మా భూములన్నీ దోచే నమ్మో , ఈ పేట లోన "బతుకూ "
మొండీ ధైర్యంతో మోహిని, కారులోన పోతుంటే
నేతలూ చుట్టూ ముట్టే నమ్మో , ఈ పేట లోన "బతుకూ "
పరుగో పరుగున పారణి , సమ్మెలకూ పోతే
పోలీసులు చుట్టూ ముట్టే నమ్మో , ఈ పేట లోన "బతుకూ "
నోరూ వాటంతో రాగిణి , ధరణీ క్షేత్రం పొతే
మీడియా చుట్టూ ముట్టే నమ్మో , ఈ పేట లోన "బతుకూ "
కట్టూ కథలతో కాలిని , కోర్టూ కు పోతే
లాయర్లు చుట్టూ ముట్టే నమ్మో , ఈ పేట లోన "బతుకూ "
No comments:
Post a Comment