అంశం: చిత్ర కవిత (అన్నదాత-ప్రకృతి ప్రకోపం)
శీర్షిక: దుఖాన్ని దిగమ్రింగుతూ అన్నదాత
నిత్య కృషీ వలుడు రైతన్నా!
నిరంతర శ్రమజీవి రైతన్నా!
దేశానికి వెన్నెముక రైతన్నా!
అన్నార్తులకు ప్రాణదాత రైతన్నా!
కండలు కరిగించుతూ రైతన్నా!
ఎండలో మాడుతూ రైతన్నా!
గంజి మెతుకులనారగిస్తూ రైతన్నా
ఆలు బిడ్డల డొక్కలు మాడ్చే రైతన్నా!
గోచిని చెక్కి, తలకు రుమాలు చుట్టి
హలమును పట్టి, కావడెద్దుల కట్టి
పొలమును దున్ని, ఒడ్డులను గట్టి
గొర్రును తోలి, మడులను కట్టి!
నారును పోసి , నాట్లను వేసి
నీరును పారించి , మందులు చల్లి
పంటలు పండించు రైతన్నలకు
వరుణుడు కరుణించకుంటే అధోగతే!
ప్రకృతి ప్రకోపంతో సకాలంలో వర్షాలు పడక
నేల తల్లి బీటలు బారగ నారు ఎండిపోగా
దిక్కు తోచక రైతు దున్నల మేపుతుండే
డొక్కలెండిన రైతు అప్పులు ఎలా తీర్చాలని
ఆకాశంలో చూస్తుండే దుఃఖాన్ని దిగమ్రింగుతూ అన్నదాత!
No comments:
Post a Comment