అంశం: మెరికలు
శీర్షిక: *శిశిరంలో ఎండుటాకులు*
శిశిరంలో ఎండుటాకులు రాలు *గల గల*
గాలి వీస్తుంటే వినబడు ఆకుల శబ్ధం *అదోలా ఏదోలా*
చెట్లపై సూర్య కిరణాలు పడుతుంటా *యి*
తరువుల ఆకులు పండుతుంటా *యి*
పండిన ఆకులు ఎండు తుంటా *యి*
ఎండినవి వెంటనే రాలుతూ ఉంటా *యి*
క్రింద రాలినవి గాలికి కొట్టుకు పోతుంటా *యి*
*కొమ్మలు* చిగురించు చుండు లేత *కొమ్మలు*
*పచ్చగ* పెరుగు చిగురు టాకులు లేత *పచ్చగ*
ఎండకు ఎండి మాడు తుండు *తరువులు*
*తరువుల* కు నీరు లేక కొమ్మలు *ఎండు*
*ఎండిన* కొమ్మలు అప్పుడప్పుడు *విరుగు*
*విరిగిన* వాటిని తెచ్చెదరు ఇంటికి *జనులు*
*జనులు* కట్టెలను వంటలకు వాడెదరు
శిశిరంలో ఎండుటాకులు రాలు *గల గల*
గాలి వీస్తుంటే వినబడు ఆకుల శబ్ధం *అదోలా ఏదోలా*
No comments:
Post a Comment