అంశం: కదిలించిన దృశ్యం
శీర్షిక: *నా జీవితం నా ఇష్టం*
ప్రేమించుకున్నారు
కులాంతర వివాహం చేసుకున్నారు
అపురూప ప్రేమకు గుర్తుగా
ఒక కూతురు ఒక కొడుకుకు జన్మనిచ్చారు
ఆనందంగా జీవిస్తున్నారు
కూతురు కొడుకు విదేశాల్లో సెటిలయ్యారు
విధి వెక్కిరించింది, దురదృష్టం వెంటాడింది
భర్త రోడ్ ఆక్సిడెంట్ లో దుర్మరణం చెందారు
తొమ్మిది రోజుల కార్యక్రమాలు
చకచకా జరిగిపోయాయి
బంధుమిత్రులు వస్తున్నారు పోతున్నారు
ఊరడిస్తున్నారు ధైర్యం చెబుతున్నారు
పదవ రోజు రానే వచ్చింది
పెద్దవాళ్ళు కార్యక్రమాల గురించి చెబుతున్నారు
భార్య ససేమిరా అంటుంది
కర్మకాండ రోజువి బట్టలు వేసుకోనంటుంది
కాటి వద్ద స్నానం చేయనంటుంది
పుస్తే మట్టెలు గాజులు తీయనంటుంది
పసుపు ముఖాన పూసుకోను అంటుంది
అన్న ఇంటికి నిద్రకు పోనంటుంది
అస్థికలు విదేశాల్లో కలుపుతా నంటుంది
ఎవరు చెప్పినా విన నంటుంది
తన భర్త తనతోనే ఉన్నాడంటుంది
ఎంత సర్ది చెప్పినా వినలేదు
తాను అనుకున్నది సాధించింది
హృదయం చలించి పోయింది
మనసు కలిచి వేసింది
వచ్చిన బంధు మిత్రులు నిర్ఘాంత పోయారు
చిన్న వయసులోనే భర్త పోయాడన్న బాధ
అందరికీ ఉంటుంది
జాలి ఉంటుంది సానుభూతి ఉంటుంది
అది కాదనలేని నగ్న సత్యం!
కానీ, భారతీయ సాంప్రదాయాలు పాటించాలి
గుడిలో, పుట్టిన వారిన ఇంట్లో నిద్ర చేయకుండా
ఎవరింటికి వెళ్ళ కూడదు
పుస్తె మట్టెలు గాజులు తీయకుంటే
ఎవరైనా తెలియక శుభకార్యాలకు పిలుస్తె
ఎవరికైనా అశుభం జరుగవచ్చు.
*నా జీవితం నా ఇష్టమని*
నాకు ఎదురు లేరని స్వేచ్ఛ ఉందని
సాంప్రదాయాలను ధిక్కరించడం సరికాదు
మనిషి సంఘ జీవి
మనుష్యులతో కలిసి జీవించాలి
మనుష్యులలో పిల్లలకు సంబంధాలు
అందుకోవాలి, రేపు జీవితం గడుపాలి
భారతీయ సాంప్రదాయాలు పాటిస్తూ
పెద్దల మాటలను గౌరవిస్తూ
ధైర్యంగా జీవించాలి
రేపటి తరానికి మార్గదర్శకులుగా నిలువాలి.
No comments:
Post a Comment