Thursday, March 20, 2025

Pసాహిత్యమంటే చైతన్య కరదీపిక

నేటి అంశం -సాహిత్యాభిలాష

శీర్షిక: *సాహిత్యమంటే చైతన్య కరదీపిక*

ప్రజలను చైతన్య పరిచే కర దీపిక
లలితమైన తెలుగు పదాల అల్లిక
అ్నదాతలకు తోడుగా నుండే హాలిక
సమస్యలకు పరిష్కారం చూపే వేదిక
ప్రియుడిన కొంగున ముడి వేసే అభిసారిక!

సాహిత్యాభిలాష ఒక బాధ్యత 
ఒక పరిష్కారమార్గం ఒక భరోసా 
ఒక చైతన్యం ఒక ఆలన పాలన 
ఒక ధైర్యం ఒక స్థైర్యం ఒక శౌర్యం!

*రవి గాంచని చోటును కవి గాంచునన్నట్లు*
కవిలో మెదిలే ఆలోచనలను స్పందనలను
బాధిత జనుల గుండెల్లోకి చొప్పించి
సమస్యలకు చరమగీతం పాడేదే సాహిత్యం!

సాహిత్యమనేది కేవలం సామాజికమే కాదు
అది సాంఘీకం, రాజకీయం, ఆధ్యాత్మికం
ఇది కేవలం ఒక ప్రాంతానికి కాదు
అది రాష్టంలో దేశంలో విశ్వాన అనంతం!

సాహిత్యం సామాజికానికి దగ్గరగా
అధికంగా పెనవేసుకుని ఉండు
మానవ మనుగడకు అడ్డు తగిలే
అన్ని సమస్యలపైననూ పంజా
విసురు తుండు తన గళాన్ని వినిపించు!

సమస్యలు  సమసిపోయే వరకు
దాని వెంట పడు ప్రజలను చైతన్య పరుచు
పరిష్కార మార్గం చూపెట్టు
స్వాతంత్ర్య సమరంలో బంకించంద్ర రచించిన
"వందేమాతరం" ఓ ప్రభంజనం!

సాహిత్యం లేకుండా జనులలో ఉనికి లేదు
దేశంలో ప్రగతి లేదు!
 

No comments: