Thursday, March 13, 2025

ఉమ్మడి కుటుంబాలు

అంశం: ఐచ్చికం


శీర్షిక : *నాటి ఉమ్మడి కుటుంబాలు*

పొట్టకు వచ్చిన పచ్చని చేనులా
శిశిర ఋతువులో మాఘ మాసంలో
విర బూసిన మామిడి తరువుల్లా
మహా కుంభమేళాలో ప్రయాగలో
త్రివేణి సంగమంలో స్నానాలాచరించిన
భక్తుల జనసందోహంలా
*నాడు ఉమ్మడి కుటుంబాలు* కళకళలాడేవి

అప్పుడు ఏ ఎలక్ట్రానిక్ మీడియా లేదు
చరవాణీ లు మచ్చుకు లేవు
రవాణా సౌకర్యాలు అంతంత మాత్రమే
ఎద్దుల బండ్లు, కచ్చరాలు, కాలి నడకనే

ఏ చిన్న ప్రభోజనం జరిగినా, ఏ పండుగ వచ్చినా
ఏ పబ్భం వచ్చినా, ఏ వివాహం జరిగినా
ఏ పావురంతో సమాచారం పంపినా
సద్ది మూటలు కట్టుకుని, ఇంటిల్లిపాదీ
వాలి పోయే పరిస్థితి
ఓ కాకి రూపంలో  వచ్చి పిట్ట గోడపై కూర్చుని
చుట్టాలు వస్తున్నారని తెలియ జేసే మెకనిజం

ఇంటి పెద్దతే అంతా భారం
ఆ ఇంటి పెద్ద మాటే వేదం
ఉండేది పెద్దంటే ఎంతో గౌరవం
అందరిలోనూ కలుపుగోలు తనం

సంస్కృతి సాంప్రదాయాలకు
పెద్ద పీట వేసే వారు
చిన్నలు పెద్దలు చక్కగ నేర్చుకునే వారు
ఏ సమస్య అయినా నాలుగు గోడల మధ్యనే
తేల్చుకునే వారు, సర్దుబాటు చేసేవారు
చుట్టాలు వస్తే పది రోజుల ముందే వచ్చి
పండుగనో, ప్రభోజనంమో వెళ్ళాకా
పది రోజులకు వెళ్ళే వారు
కాదు కూడదు వెళ్తామంటే పిల్లలు
చెప్పులో, ఛత్రో, సంచో,కర్రో దాచే వారు

అప్పటి ప్రేమాప్యతలు ఎనలేనివి
నాటి ‌సాంప్రదాయాలు సంస్కారాలు
సంతోషాలు ఆనందాలు మరుపురానివి
గౌరవాలు మర్యాదలు వెలకట్టలేనివి

No comments: