Thursday, March 13, 2025

కుక్క కాటుకు చెప్పుదెబ్బ

అంశం: ప్రతిస్పందన 

శీర్షిక: కుక్క కాటుకు చెప్పుదెబ్బ 

విత్తు ఒకటి పెడితే చెట్టొకటి మొలువదనేది 
ఓటర్లకు బోధపడితే చాలా సమస్యలకు 
పరిష్కారం లభిస్తుంది 

అలానే నేతలు కూడా దేనినైనా 
తెగేదాకా లాగొద్దంటారు పెద్దలు 
ఇప్పుడు చేతులు కాలాక 
ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏమిటి?
ఆనుభవించాలి నేపాల్ ప్రభుత్వం తిరుగుబాటు దెబ్బలు! 

జనరేషన్ జెడ్ ను చులకన చేస్తే 
మెలికలు పెట్టి చుక్కలు చూపుతారు 
కళ్ళుమూసుకుని పిల్లి పాలు త్రాగినట్లు 
ప్రభుత్వాలు అవినీతి మయమైతే 
ఎంత కాలం దాగుతుంది బట్టలో కట్టిన 
అగ్ని కణం!

సోషల్ మీడియా ప్రజల వారధి రథసారధి 
ప్రజల స్వేచ్ఛ హక్కులైన వాట్సాప్ ఫేస్ బుక్ 
వంటి మీడియాను నిషేధిస్తే తిరుగబాటే కాదు 
ప్రభుత్వాలనే కూల్చే సత్తా ప్రజలకు ఉంటుంది 
కుక్క కాటుకు చెప్పుదెబ్బ అంటే ఇదే!

నాయకులను ఎన్నుకునేది 
ప్రజలను రక్షించడానికి గానీ శిక్షించడానికో  
దేశ సంపదను భక్షించడానికో కాదు కదా 
ఇది ఇతర దేశాలకు కనువిప్పు కావాలి! 

ఏ దేశ ప్రభుత్వాలైనా సాఫ్ట్వేర్లను ఆప్ లను
రద్దు చేయగలవేమో గానీ ప్రజల రక్తనాళాల్లో 
ప్రసరించే  'పౌరుషం'  'ఆత్మాభిమానం' గల
రుధిరానికి అడ్డుకట్టవేయలేరు! 

"పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్లు 
తప్పా" అని శ్రీ శ్రీ గారు అన్నట్లు 
నేపాల్ ప్రజలు పోరాడాలి నిరంకుశ పాలనను 
అవినీతి ప్రభుత్వాలను అంతమొందించాలి 

విదేశీ శక్తుల ప్రభావం కొట్టి పారేయలేము 
ఎవరి స్వార్ధాలు వారివి! 

No comments: