*కాదేది కవితకనర్హం*!
****************
*కుక్క పిల్ల*
*అగ్గిపుల్ల*
*సబ్బు బిళ్ళ*
కాదేది కవితకనర్హం ,
అంటారు *శ్రీ ,శ్రీ* .
మద్యం త్రాగే వారికి
పద్యం ఎదో ,గద్యం ఎదో ,
కవిత ఎదో , వచనం ఎదో
అర్ధం కాదు . మనవారెవరో
పరవారెవరో అర్ధం కాదు.
కాదు కాదు ,అవుతుంది
మద్యం దిగాక లేదా
సాటి వారిని అర్ధం
చేసుకున్నాక .
జీవితం పై విరక్తి
చెందాక ముసలి తనం
లోనే వ్రాశాడు
*వేమన* , పద్యాలు.
ఏమి చదివెనో , ఎలా వ్రాసేనో
సంకలనం చేసిన ,
*సి .పి. బ్రౌన్* కే ఎరుక .
కటిక జీవితాన్ని
అనుభవిస్తూ ,
ఒక్క సిరా చుక్క
వేయి మెదళ్ళు
కదిలించు నన్న
*కాళోజీకి* తెలంగాణా
వచ్చాకనే ,కాటికి కాలు
సాచాకనే వచ్చింది
గుర్తింపు .
ఒక ఇంర్వ్యూ లో
పది పాసయ్యావా ,
ఫెయిలయ్యవా,
అని అన్నాకనే ,
వచ్చింది పట్టుదల
*సుద్దాల అశోక్ తేజ* కు
(అప్పటికే వారు ఎం. ఏ.
గోల్డ్ మెడలిస్ట్ .)
గద్దరన్న , ఒక్క మీటింగ్
అటెండవుతే చాలు,
పుట్టుకొస్తాయి
విప్లవ గీతాలు .
*గోరెటి వెంకన్న*
జానపద గీతాలు ,
గగన కుసుమాలు .
ఎవరి *గళం* వారిదే ,
ఎవరి *కలం* వారిదే .
ఎవరి *గుర్తింపు* వారిదే.
No comments:
Post a Comment