అంశం: కీర్తి - ప్రతిష్ఠలు
ప్రక్రియ: కవిత
వస్తువు
ఉపయోగాన్ని బట్టి
విలువ!
చెట్టు
ఔషద గుణమును బట్టి
గుర్తింపు!
స్త్రీ
అందాన్ని బట్టి
ఆకర్షణ!
మనిషి
చేసే మంచి పనులను బట్టి
ప్రతిష్ట!
విలువ , కీర్తి , పలుకుబడి , పేరు , ప్రతిష్ఠలు
కావు భూమిలో మొలిచే మొలకలు
కావు దుకాణంలో దొరికే ఏలకులు
కావు ఆకాశంలో అగుపించే నక్షత్రాలు
కీర్తి ప్రతిష్ఠలు జనులందరికీ అసాధ్యం
రావణుడిని వధిస్తే లభించిన విజయం
సాగరాన్ని మధిస్తే లభించిన అమృతం
గొప్పసేవలకు ,గొప్ప రచనలకు,దానాలకు
లభించే అరుదైన బహుమానం
వేదవ్యాస్ , వాళ్మీకి , నన్నయ , తిక్కన
గౌతమ బుద్ద , స్వామి వివేకానంద
అల్లూరి , సుభాస్ , భగత్ సింగ్ ,ఠాగూర్
గాంధీ , పటేల్ సేవలు అద్భుతం
వీరి కీర్తి ప్రతిష్ఠలు , విశ్వజనీనం
కరోనా కాలం ఫ్రంట్ వారియర్స్ ఆరాధ్యులు
కరోనా కాలంలో సోనూ సూద్ మహా మనీషి
కరోనా కాలంలో ఆనందయ్య ఆపద్భాంధవుడు
వీరి కీర్తి ప్రతిష్ఠలు అజరామరం ,ఆచంద్రార్కం
No comments:
Post a Comment