Friday, March 14, 2025

నిన్ను నీవు ప్రేమించుకో

అంశం: *నిన్ను నీవు ప్రేమించుకో*

శీర్షిక: *నీకు నీవే రాజువు*

ఎనుబది నాలుగు లక్షల జీవరాశులలో
మానవజన్మ ఉత్కృష్టమైనది ఉన్నతమైనది!

ముందుగా నిన్ను నీవు ప్రేమించుకో
ఎవరి ముందూ తలదించకు
గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని పెంచుకో
కానీ అహంకారాన్ని తగ్గించుకో!

నీకు నీవేరాజువు అవసరంలేదు ఏ ఋజువు
నీ అందాన్ని ఆహార్యాన్ని వ్యక్తిత్వాన్ని
నీ ఇష్టాలను పనులను ఆలోచనలను
నీ భావాలను భావోద్వేగాలను అర్ధం చేసుకో
ఆ తరువాతనే ఏదైనా ఎవరైనా అని గుర్తుంచుకో!

మల్లెమొక్కకు ఏమి తెలుసు తాను రేపు పందిరంతా
అల్లుకు పోతానని, మల్లెల పరిమళాలు వెదజల్లుతాననీ!

నీ మనసే నీ తేజస్సు నీ వయసే నీ యశస్సు
నీ ప్రతిభే నీ ఆభరణం నీ ఆనందమే కొండంత బలం!

నీలో శక్తి యుక్తి  తెలివి  జ్ఞానం అపారం
నిన్ను నీవునమ్ము  కాదు ఏదీ వమ్ము
నిన్ను నీవు ప్రేమిస్తేనే నీలోని అంతర్గత శక్తి తళతళ మెరియు
అప్పుడు నీకు గుర్తింపు పేరు ప్రతిష్ట ప్రకాశించు!

ఏమో రేపు నీవు ఏ గౌతమబుద్దుడివో
స్వామీ వివేకానందా వవుతావేమో!

No comments: