Thursday, March 13, 2025

శిశిరాలు -జలపాతాలు

అంశం: శిశిరాలు


శీర్షిక: జలపాతాలు

ఆహా..!
మంచి చెడులు తెలిసిన మనిద్దరం
అమ్మా నాన్నల ఒప్పించి
ఆగ మేఘాల్లా వచ్చితిమి
అందరినీ సంతృప్తి పరిచితిమి!

ఓహో..!
ఎక్కి దిగే పాకురుబండపై కూర్చుండి
పైనుంచి  క్రిందకు పారే జలపాతంలో
ఎగుడు దిగుడు నీటిలో తేలిపోతుంటే
ఆ సంతోషం వ్యక్తపరుచ తరమా!

వావ్..!
అటు ఇటు చూడు ప్రకృతి అందాలు
అక్కడ ఇక్కడా నీటి బుడగలు
మునిగి తేలే పిట్టల జంటలు
మెలికలు తిరుగుతూ హొయలు చూపు!

ఓయ్..!
గబగబా స్వెట్టర్ వేసుకో
గరంగరం చాయ్ త్రాగుతూ
ఆడుతు పాడుతు నడిచి పోదాం
వాలిపోదాం....తేలిపోదాం..!

అవును..!
చలిచలిగా ఉన్న మేనులతోనే 
చకచకా ఇంటికి వెళ్ళి పోదాం 
తడబడ కుండా సాగిపోదాం 
వెచ్చ వెచ్చని చరిత్రను సృష్టిద్దాం!

No comments: