Wednesday, March 12, 2025

వసుదైక కుటుంబం /పదాల కవిత

పదాల కవిత
(అనుభూతి, అనురాగం, అభిమానం, అనుదినం, అందరు, అందం)

శీర్షిక: *వసుధైక కుటుంబం*

*బిందువు బిందువు సింధువు అయినట్లు*

కుటుంబంలోని సభ్యులు అమ్మానాన్నలు
అమ్మమ్మ  తాతలు కొడుకులు బిడ్డలు 
అందరూ  ప్రేమ *అభిమానం* తో
కలిసి జీవించడమే ఉమ్మడి కుటుంబం!

భార్యా భర్తలకు అన్నదమ్ములకు
అక్కాచెల్లెళ్ళకు పిల్లలకు ఇంటిల్లిపాదికి
ఒకరిపై ఒకరు ప్రేమ *అనురాగం* కలిగి
ఉండటమే వసుదైక కుటుంబం!

నాడు ఉమ్మడి కుటుంబాల సభ్యులలో
ఆప్యాయతలు *అనుభూతులు*
అనురాగ సింధువులా 
సుస్పష్టంగా చక్కగా కనబడేవి!

రోజులు మారాయి రాజులు మారారు 
న్యూక్లియర్ కుటుంబాలు దేశమంతా 
రాజ్యమేలుతుండే
*అనుదినం* చదువులు ఉద్యోగాలు
ఉరుకులు పరుగులు!

నేడు *అందరు* స్వతంత్రంగా జీవించను
అలవాటు పడిపోయే
స్వేచ్ఛ సాధికారత పెరిగి పోయే 
గ్లోబలైజేషన్ తో ప్రపంచం కుగ్రామమాయే
ఒకరిపై ఒకరికి ప్రేమ దయ కరుణ జాలి
ఆప్యాయతలు అంతంత మాత్రమే!
    
ఏది ఏమైనా కాల పరిస్థితులను బట్టి
ఎక్కడ జీవించినా ఎంత ఎత్తుకు ఎదిగినా
మూలాలు మరువకుండా ఒకరిపై ఒకరికి
ప్రేమలు ఉంటేనే *అందం* చందం!

No comments: