Wednesday, March 19, 2025

జీవితం ఒక ప్రయాణం లాంటిది

అంశం: ఆ పాట - నా పదాలు


సినిమాపేరు: ప్రేమాభిషేకం (1981)
రచయిత పేరు: దాసరి నారాయణరావు
సంగీత దర్శకత్వం: చక్రవర్తి
పాడిన వారు:బాల సుబ్రహ్మణ్యం
నటీ నటులు: అక్కినేని నాగేశ్వరరావు
జయసుధ, శ్రీదేవి

ఇందులో హీరో రాజేష్ వయసులో ఉన్నప్పుడే ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తాడు. ఎంతో కాలం సరదాగా తిరుగుతారు షికార్లు కొడుతారు. పెండ్లి చేసుకుందామనేసరికి ఛీ కొడుతుంది. వేశ్యతో సరదాగా నటిస్తే, ఈర్ష్యతో కోపంతో వచ్చి ఆ అమ్మాయి పెళ్ళికి ఒప్పుకుంటుందని అనుకుంటాడు.
అలా జరగలేదు. కొంతకాలానికి తెలుసుకుని జయంతి వద్దకు వచ్చి, డబ్బు ఇస్తాను అతన్ని నీ వద్దకు రానివ్వ కంటుంది. జయంతి డబ్బు డబుల్ ఇస్తానని ఒప్పుకోదు. ఇంతలో రాజేష్ వచ్చి ప్రేమించిన అమ్మాయిని మందలిస్తాడు. నీకు పెళ్లి కాదని రెచ్చగొడుతాడు. అందుకు కారణం అతనికి క్యాన్సర్. కోపంగా వెళ్లి పెళ్లి చేసుకుంటుంది. అప్పుడు తెలుస్తుంది ఆమెకు, రాజేష్ కు క్యాన్సర్ అని. ఇక్కడ జయంతి కోరిక మేరకు తాళి కట్టి ముత్యైదువను చేస్తాడు. ఆ సందర్భంగా :

శీర్షిక:  జీవితం ఒక ప్రయాణం లాంటిది

కాలం ఎంతో విలువైనది ఏ నిమిషం ఆగదు
సాగుతూనే ఉంటుంది కాల చక్రంలా
ఆగితే ముందుకు సాగదు ఈ లోకం
కాలం సాగుతేనే భూమిపై చీకటి వెలుగులు
కాలం సాగుతేనే జీవకోటికి అందు గాలి నీరు!

చందమామ చల్లగా ఉంటుందని
వెన్నెల వెలుతురును పంచుతుందని
తెలిసినా  గ్రహణం రాక  ఆగుతుందా
పుష్పాలు సుకుమారంగా ఉంటాయని
ఊపితే రాలుతాయిని తెలిసినా
వాయుదేవుడు గాలి వీచకుండా ఉంటాడా!

హృదయం అద్దం లాంటిదని తెలుసు
పగలుతే అతుకదనీ మనకు తెలుసు
అయినా చావు రాకుండా ఆగుతుందా!

జీవితం ఒక ప్రయాణం లాంటిది
ఎక్కడికి  వెళ్తామో తెలియదు
తెలిసిననూ  ప్రయాణం ఆగదు కదా
పుట్టుటనేది ధర్మం గిట్టుటనేది కర్మం
జనన మరణ చక్రమాగదనీ తెలుసు
అది ఏ జీవికి తప్పదని కూడా తెలుసు
తెలిసినా మనిషి తన తపన ఆగదు!

       

No comments: