అంశం: ఉగాది గేయాలు
శీర్షిక: *రావమ్మా ఉగాది రావమ్మా!*
రావమ్మా ఉగాదీ రావమ్మా...
*క్రోధీ* నీ సాగనంపీ.... "2"
*విశ్వా వసు* ను తోలుకుని రావమ్మా...
జీవితమంటే కోపం తాపం జాలి...
ప్రేమ దయనే అంటూ.....
గొప్ప సందేశాన్నీ ....
మోసుకునీ రావమ్మా... "రావమ్మా"
చరణం:01
కోడి కూయక ముందే....
పొద్దు పొద్దున్నే లేచి...
కోకిలలు కుహూ కుహూ అని కూస్తుండ..
పడతులు లోగిళ్ళు ఊడ్చి..
కళ్ళాపి చల్లి రంగవల్లు లేయంగా... "రావమ్మా "
చరణం :02
తలంటు స్నాన మాచరించి...
కొత్త వస్త్రాలను ధరించి....
గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి...
పూలదండలు చుట్టి....
ఇష్టమైన దైవాన్ని నిష్టతో గొలువంగ.... "రావమ్మా"
చరణం:03
తీపి పులుపు ఉప్పు కారం..
చేదు వగరు షడ్రుచుల పచ్చడి సేవించ..
పంచ బక్షాలు, పరమాన్నాలను...
పిండి వంటలనారగించి....
మమ్ములను దీవించ... "రావమ్మా"
No comments:
Post a Comment