Sunday, March 16, 2025

ఎందుకో...ఈ తేడా లెందుకో..

అంశం-ప్రపంచ కవితా దినోత్సవం (చిత్ర కవిత)
తేదీ:21.03.25
అంకితం - కవులకు కవయిత్రులకు

శీర్షిక: "ఎందుకో.. ఈ తేడాలెందుకో"

దేశం ఒకటే
రాజ్యాంగం ఒకటే
ప్రజా పాలనలో
తేడా లెందుకో!

దేశం ఒకటే
రాజ్యాంగం ఒకటే
రైతులకు
రైతు బంధు పధకాలు
కౌలు దారులకు కూలీలకుండవు
కౌలు పధకాలు కూలీ పధకాలు
తేడాలెందుకో!

దేశం ఒకటే
రాజ్యాంగం ఒకటే
చట్టాలు
ధనికులకే చుట్టాలు
పేదలకు కష్టాలు
తేడా లెందుకో!

దేశం ఒకటే
రాజ్యాంగం ఒకటే
కుటుంబ నియంత్రణ
కొందరికి
కుటుంబ నియంత్రణ
వర్తించదు మరికొందరికి
తేడా లెందుకో!

దేశం ఒకటే
రాజ్యాంగం ఒకటే
రిజర్వేషన్లు
ఉంటాయి కొందరికి
రిజర్వేషన్లు
వర్తించవు మరికొందరికి
తేడా లెందుకో!

దేశం ఓకటే
రాజ్యాంగం ఒకటే
చిల్లర 
ఆర్ధిక నేరస్థులు జైలులో
ఘరాన
ఆర్ధిక మోసగాళ్ళు బయట
తేడా లెందుకో!

దేశం ఒకటే
రాజ్యాంగం ఒకటే
అధికారుల, నేతల
పిల్లలు ప్రయివేట్ స్కూల్లో
పేద ప్రజల
పిల్లలు ప్రభుత్వ స్కూల్లో
తేడా లెందుకో!

దేశం ఒకటే
రాజ్యాంగం ఒకటే
అధికారుల, నేతల
వైద్యం ప్రయివేట్ హాస్పిటల్స్ లో
పేద ప్రజల
వైద్యం ప్రభుత్వ హాస్పిటల్స్ లో
తేడా లెందుకో!

దేశం ఒకటే
రాజ్యాంగం ఒకటే
పాలకులు
హామీలిచ్చి మాటతప్పుతే 
నాయకులు
ప్రజలు
ఓట్లేసి అధికారమిచ్చి అడుగుతే 
నేరస్థులు
తేడా లెందుకో!

దేశం ఒకటే
రాజ్యాంగం ఒకటే
గుడులలో
కొందరు 
వారిఆదాయాన్నివారు 
తీసుకుంటేనేరం కాదు
మరి కొన్ని గుండులలో
వారి ఆదాయాన్ని వారు 
తీసుకుంటే నేరం
తేడా లెందుకో!

దేశం ఒకటే
రాజ్యాంగం ఒకటే
ధనికులు
తప్పులు చేస్తే నేరం కాదు
పేదలు
అదే తప్పు చేస్తే నేరం
తేడా లెందుకో!

దేశం ఒకటే
రాజ్యాంగం ఒకటే
కొందరికి
చట్టాలు వర్తిస్తాయి
మరి కొందరికి
అవే చట్టాలు వర్తించవు
తేడా లెందుకో!

దేశం ఒకటే
రాజ్యాంగం ఒకటే
ప్రతిపక్షాలకు
ఎన్నికల నిబంధనలు వర్తిస్థాయి
పాలకులకు
ఎన్నికల నిబంధనలు వర్తించవు
తేడా లెందుకో!

దేశం ఒకటే
రాజ్యాంగం ఒకటే
పేదలకు
విద్య వైద్యం ఉచితాలు నేరమట
నేతలకు
ఎలక్ట్రో బాండ్లు నేరం కాదట
తేడాలెందకో!

దేశం ఒకటే
రాజ్యాంగం ఒకటే
ధనికులైన 
పేదలైనా
ముసుగు పెట్టుకుని
గుడిసెలో
ముడుసుకుని పడుకున్నా
విమానాలలో విహరిస్తున్నా
వజ్రాల 
పట్టెమంచంపై పడుకున్నా
యముడు
పంచ భక్ష 
ఫలహారాలు భుజిస్తున్నా
రంభ మేనకలతో 
రాస క్రీడలు ఆడుతున్నా
యముడు పిలుస్తే
ఎవరైనా పోయేదీ
ఏనాడైనా పోయేదీ 
*శ్మశానానికే*
*అదియూ శూన్య హస్తాలతోనే*
*ఎందుకో...ఈ తేడా లెందుకో!*

No comments: