అంశం: *కవితంటే*
శీర్షిక: సమాజాన్ని చైతన్య పరిచే చంద్రిక
*కవిత* మూడు అక్షరాల పదం
సాగదీస్తే అవుతుంది శతకోటి అక్షరాలు
అందమైన భావాలకు సుందర
అక్షర కుసుమాల అల్లిక
కప్పిపుచ్చితే కవిత విప్పి చెప్పుతే విమర్శ
సమాజాన్ని చైతన్య పరిచే చంద్రిక
సంఘాన్ని సంస్కరించేది సంభాలించేది
స్వాంతన నిచ్చేది సంస్కారాన్ని నేర్పేది
ప్రభుత్వాలను జాగృతంచేసేది దారికి తెచ్చేది
ప్రజల పక్షపాతి పరిష్కార దీపిక కవిత
విజ్ఞానాన్ని పంచేది అజ్ఞానుల కనులు తెరిపించేది
రవి కాంచని చోటును కవిత కాంచును
కవితకూ ఉన్నారు సవతులు వారే పద్యాలు
No comments:
Post a Comment