అంశం:విపంచికలు
శీర్షిక: *జీవిత సత్యాలు*
చీకటి వెలుగుల మాయాలోకం ఇది
ప్రపంచంలో మంచి చెడులు సహజం
గమనించాల్సినది ఇక్కడ జ్ఞానులెవరు మూర్ఖులెవరను సత్యం
వెలుగుల చెడులు మూర్ఖలెవరను జ్ఞానం
అది అసహజం అసత్యం అజ్ఞానం!
గెలుపు ఓటమిలు సహజం మానవులకు
జీవులకు జననం మరణం తప్పదు
అయినా అనుభవిస్తారు సుఖాలు దుఃఖాలు ఎల్లవేళలా
ఓటమిలు మరణం దుఃఖాలు సుఖాలు
దానవులకు తప్పవచ్చు అప్పుడప్పుడు దుఃఖాలు!
తిన్నా తినకున్నా సంసారానికి గుట్టుండాలి
బయట మనవారెవరో పరాయివారెవరో తెలియదు
ఎవరితోనూ మనవి లాభాలు నష్టాలు చెప్పొద్దు ఎప్పుడూ
తినకున్నా పరాయివారెవరో నష్టాలు లాభాలు
బహిర్గతమవ్వాలి తెలియును ఇప్పుడూ నష్టాలు!
No comments:
Post a Comment