నూతన ప్రక్రియ: బుల్లెట్ పాయింట్స్
01.
అయ్యవారి కోపం!
అమ్మవారి తాపం!!
02.
పేరుకే సంక్షేమపథకం!
నేతలకు దక్కేదే అధికం!!
03.
ఆనందయ్య మందు!
ఉంటాము ముందు!!
04.
హుండీలో మొత్తం!
దేవుడి చిత్తం!!
05.
తాతకుతగ్గ మనుమడు!
వాడు మహాఘనుడు!!
06.
నాన్నెపుడూ వెనుకే!
వెనుకంటే వెన్నెముకే!!
07.
అమ్మంటే దేవత!
సహించు భూమాత!!
08.
నాన్నంటే మేటి!
నాన్నకెవరు సాటి!!
09.
నాన్నంటే బాధ్యత!
ఎవరివ్వరు ప్రాధాన్యతి
10.
అన్నదమ్ముల బంధం!
అమ్మ రక్తసంబంధం!!
11.
పోతుంది కరోనా!
ఖాలీ దవాఖానా!!
12.
ఓటుకేసేరు గాలం!
ఆపైవేసేరు వేలం!!
13.
ఆన్లైన్ క్లాసులు!
ఎన్నో తిరకాసులు!!
14.
దేనికీ ఆశపడకు!
లేదంటే రేషపడకు!!
15.
పుట్టినపుడు ఏమితేరు!
గిట్టినపుడు ఏమితీసుకపోరు!!
No comments:
Post a Comment