అంశం: చిట్టెలుక (బాల సాహిత్యం)
శీర్షిక: ఎలుక
(బాల సాహిత్యం)
ఎలుకా ఎలుకా చిట్టెలుకా
కలుగుల దాగుంటావు
ఎనుగుల తిరుగుతుంటావు
ఎక్కడ కుదురుగా నీవుండవు!
చూపుకే చిట్టెలుకవు
మాపుకు ఎదిరి చూస్తవు
పదునైన నీ పండ్లతో
దేనినైనను ఫటఫటమని కొరికేస్తవు!
ఎలుకా ఎలుకా చిట్టెలుకా
గణపతి వాహనం నీవమ్మా
ఉండ్రాళ్ళన్నీ మెక్కెదవా
కడుపు నొప్పితో పడుకుందువా!
తప్పుగా ఏమి అనుకోకు
తిప్పలు ఏమీ పడబోకు
గణపతిని ఎలా మోసెదవు
గుణగుణ ఎలా నడిచెదవు!
వినాయక చవితి రోజు
కొత్త వస్త్రములను ధరించెదరు
పిండి వంటలు చేసెదరు
మీకు హారతి పట్టెదరు !
శుచిగా చేసిన నైవేద్యాలు
ఇంటికి నాలుగు దిక్కుల పెట్టియు
ఆరగించమని ఆహ్వానించెదరు
నిను ఎంతగానో కొలెచెదరు!
No comments:
Post a Comment