Thursday, March 13, 2025

కూతురంటే

శీర్షిక: కూతురంటే

కొడుకైనా కూతురైనా  తల్లిదండ్రులకు
ఇరువురూ రెండు కళ్ళ లాంటి వారే!

కూతురంటే ఇంటికి అప్పు కాదు  
మీ ఇంటికి పై కప్ఫు లాంటిది!

కూతురంటే కూరగాయలు కోసే పనిమనిషి కాదు  మీ ఇంటిలో పెరిగే మహాలక్ష్మి!

కూతురుపై ఖర్చు ఎందుకు వృధా అనుకునేరు  మిమ్ముల సదా మర్చి పోకుండా ఉండేది కూతురే!

మీ కష్ట సుఖాలను, బాధలను బాధ్యతలను 
అర్ధం చేసుకుని సర్దుకు పోయేది కూతురే!

కూతురంటే మెట్టినింటికి పోయే బొమ్మ కాదు
మీ రక్తం పంచుకుని పుట్టిన అమ్మ!

కూతురంటే బాధలకు ,కష్టాలకు నెలవు కాదు  స్వార్థం లేని ప్రేమకు దయకు, జాలికి ఆనవాలు!

ఇంటి పేరు మార్చు కున్నా
మరిచి పోదు పుట్టినింటిపై ప్రేమ చివరి దాక!

పెళ్ళయి పోగానే మిమ్ముల విడిచి వెళ్ళినా
ఆగ మేఘాలతో వాలి పోతుంది మీ యింట
యేకష్టం వచ్చినా!

అల్లంత దూరాన నివసిస్తున్నా
పుట్టింటిపై పోదు గారాభం ఏ కోశాన!

ఆస్తి పాస్తులపై ఆశలు లేనిది
అమ్మా నాన్నల ఆశయాలు వదులుకోనిది కూతురే!

కడకు జగములు పిక్కటిల్లేట్లుగా
దుఃఖించేది  కూతురే! 

అవసరం ఏర్పడితే  సైనికుడిలా ఏ సేవకైనా
ఏ అవయవదానానికైనా సిద్దపడేది కూతురే!

కూతురంటే ఎక్కడికో పారి పోయే జాతి కాదు
మీ ఖ్యాతి నిలబెట్టే మేటి నాతి!

కూతురున్న ఇల్లు అవుతుంది దేవతలకు 
స్వర్గ సీమ!



No comments: