Sunday, March 16, 2025

ప్రశంసా పత్రాలు పురస్కారాలు

అంశం: కవులకు పురస్కారాలు

శీర్షిక: *ప్రోత్సాహం కవులకు*

తళతళ మెరిసే కిరణాలు భానుడికి
ఎగిసి పడే కెరటాలు  సముద్రానికి
పచ్చని సోయగాలు ప్రకృతికి ఎలానో
ప్రశంసా పత్రాలు  పోష్టర్లు బిరుదులు   *పురస్కారాలు* అవార్డులు రివార్డులు   అభినందనలు కవులకు ప్రోత్సాహకాలు!


ఒక పొగడ్త కవికి నిచ్చెన ఆకాశానికి
ఒక తెగడ్త కవికి నిచ్చెన పాతాళానికి
ఒక విమర్శ కవిలో కసి పెంచ వచ్చు
ఆత్మ విమర్శకు దారి తీయవచ్చు!

వరి ధాన్యాన్ని పట్టిస్తేనే బియ్యం
కౄడ్ ఆయిల్ ను శుద్ధి చేస్తేనే ఇంధనం
బంగారాన్ని కరిగించి అచ్చుపోస్తేనే ఆభరణం
సమతుల ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యం
కవులను ప్రోత్సాహిస్తేనే ఉత్తమ కవిత్వం!

ఊరికే చెప్పే సలహాలకు విలువ ఉండదు
ఉచితంగా ఇచ్చే వాటికి మూల్యముండదు
అక్రమంగా వచ్చే డబ్బుకి పరువుండదు
ప్రోత్సాహం లేని కవులకు ఉత్సాహముండదు!

సాహిత్యానికి సమీక్షలు చేయాలి
కవిత్వానికి సకారాత్మక విమర్శలు ఉండాలి
తప్పులు దిద్దుకోడానికి అవకాశం ఇవ్వాలి
రచనలు చేయాలనే తపన మదిలో మెరియాలి!

No comments: