Monday, March 17, 2025

స్ఫూర్తి ప్రదాతలు

అంశం:వీర స్పూర్తి


శీర్శిక:  స్ఫూర్తి ప్రదాతలు

నాటి వీరుల గాధలే నేటి తరానికి స్పూర్తి
నేటి  వీరుల త్యాగాలే రేపటి తరాలకు ఆదర్శం

రాష్ట్రం కోసం దేశ  స్వాతంత్య్రం కొరకు
శత్రు దేశాల నుండి దేశ రక్షణ కొరకు పోరాడి
ప్రాణాలర్పించిన ప్రాణ త్యాగం చేసిన
స్వాతంత్ర సమర యోధులు వీర జవానులు
ఎందరో అందరికీ వందనాలు !

ఝాన్సీ లక్ష్మీబాయి అల్లూరి సీతారామరాజు
అనిబిసెంట్, దేశ్ ముఖ్ గాంధీజీ పటేల్
సుభాష్  చంద్రబోస్  మీరాబాయి భగత్ సింగ్
వీర శివాజీ శంభాజీ చాకలి ఐలమ్మ కొమురయ్య
మరెందరో వీరులు రాష్ట్రం దేశం కోసం
ప్రాణత్యాగం చేసి వీర మరణం పొందిన
*స్ఫూర్తి ప్రదాతలు*!

రాష్ట్రం పట్ల దేశం పట్ల ప్రేమ దేశభక్తి గల
ప్రజలకు వీరుల చరిత్ర ఎంతో స్పూర్తి నిస్తాయి
యువతీ యువకులు నిత్యం వీరుల
త్యాగధనుల జీవిత గాధలను ఎప్పటికప్పుడు
చదువుతూ ఉండాలి వింటూ ఉండాలి
అడిగి తెలుసుకోవాలి!

అలానే ప్రభుత్వాలు కవులు వీరుల చరిత్రలను
యధాతధంగా సులభమైన పదజాలంతో
తెలుగులో ముద్రించి నేటి తరం రేపటి తరం
చదువుకునే విధంగా అందుబాటులో ఉంచాలి
వీడియోల రూపంలో సీరియల్ల రూపంలో
సినిమాల రూపంలో తీసుకొచ్చి యువతలో
దేశ భక్తిని వీరుల స్పూర్తిని ఇనుమడింపజేయాలి!

         

No comments: