Wednesday, March 19, 2025

స్వప్నాల నెమలీకలు

అంశం: స్వప్నాల నెమలీకలు

కవిత సంఖ:95


శీర్షిక: *కృష్ణుని శిరో భూషణము*

అందమైన నెమళీకలు
ఆనందాన్ని పంచే రాగ గీతికలు
ఆహ్లాదాన్ని అందించే గోపికలు
వెలుగును పంచే వెలుగు దివ్వెలు
కృష్ణుని ఉల్లాసపరిచే వింజామరలు!

చిన్న నాటి నుండే నెమళీకలపై మక్కువ
నెమలులను చూసింది నాడు తక్కువ
అందుకే మెరుపు తీగలపై ప్రేమ ఎక్కువ
ఇప్పటికీ దాచి పెట్టాము చాలా చక్కగా!

సొగసు లద్దు పింఛములు
వయసుకు తగ్గట్లుగా నుండు తళతళలు
గడసరి తనంతో నిగనిగ మెరుయు చుండు
నిత్య లావణ్యముగా నేలపైన!

కృష్ణుని శిరోభూషణము
ఇంటికి ఎంతో శోభాయమానం
నెమళీకలు నేటికీ కొందరికి స్వప్నాలే
హరించుకు పోకుండా చూడాలి విజ్ఞులు!

      

No comments: