Friday, March 28, 2025

విఘ్నాల అధిపతి గణపతి

అంశం: జై గణేశా

శీర్షిక: *విఘ్నాల అధిపతి గణపతి*

*విఘ్నాల అధిపతి యజ్ఞాల రథసారథి*
*తల్లి మాటను జవదాటక, తండ్రినే*
*ఎదిరించి ప్రాణాలను త్యధించిన*
*ఈశ్వరుని కనిష్ట పుత్రుడు*
*సమస్త భక్తులతో పూజలందుకునే విఘ్నేశ్వరుడు*
*వారే వారే మహాగణపతి దేవుడు*

పూజ ఆరంభించదలిచినా
మీటింగ్ ప్రారంభించదలిచినా
పెళ్ళి పనులు మొదలు పెట్టదలిచినా
శుభకార్యాలు జరిపించదలిచినా 
ఎలాంటి విఘ్నాలు జరుగ కూడదన్నా!

చదువు బాగా రావాలన్నా
బజారుకు బయలు దేరాలన్నా
ఆపదలనుండి గట్టెక్కాలన్నా
మంచి కార్యాలకు ప్రయాణమైనా!

నమ్మిన బంటు ఎవరంటే గుర్తుకు వచ్చేది
తండ్రినే ఎదిరించిన వినాయకుడే
తెలివిగా ఆపదల నుండి గట్టెక్కే వారెవరంటే
కుమారస్వామిని గెలిచిన గణనాధుడే!

కుల మతాల భేదం లేకుండా
పేద ధనిక తేడా లేకుండా 
ప్రాంతాల తారతమ్యం చూడకుండా 
విగ్రహాలు పెట్టుకుని నవరాత్రులు!

అంగ రంగ వైభవంగా ప్రతియేటా
బాధ్రపద మాస శుక్లపక్ష చవితి నుండి
తొమ్మిది రోజులు పూజలు జరిగేది
పండుగల్లా ఉత్సవాలు జరుపుకునేది
చివరి రోజు గణపతి పూజల లడ్డూలను
వేలు లక్షలకు కోలా హలంగా వేలం వేసేది
విగ్రహాలను నదులలో  కొలనులలో
నిమజ్జనం చేసేది బొజ్జగణపతినే!

గణేషుడంటే ప్రజలకు ఒక దైవం
గణపతి అంటే ప్రజలకు ఒక నమ్మకం
వినాయకుడంటే భక్తులకు ప్రాణం
విఘ్నేశ్వరుడంటే జనులకు సర్వస్వం
ఇంతకంటే గొప్పేమి కావాలి గణనాథునికి!

No comments: