*నేటి కవిత*:
తేది:08.11.25
అంశం: బాలల గేయాలు
శీర్షిక: *మేమే మేమే బాలలం*
పల్లవి:
మేమే మేమే బాలలం
భావి తరానికి వారసులం
దేశ రక్షణకు సైనికులం
జగతికి మేమే దివ్వెలం! *మేమే మేమే*
చరణం:1
కులా మతాలు మాకు లేవు
పేదా ధనిక తేడా లేదు
భాష ప్రాంత భేదం లేదు
ఈర్ష్య అసూయలు అసలే లేవు *మేమే మేమే*
చరణం: 2
అందరం బడికి వెళ్ళెదము
కలిసి మెలిసీ ఉండెదము
ఒకరివి నొకరికి పంచెదము
క్రమశిక్షణను పాటించెదము *మేమే మేమే*
చరణం: 3
చక్కగ ఆటలు ఆడెదము
గెలుపు ఓటమిలను చూచెదము
పోటీ తత్వాల పెంచెదము
గొప్ప నాయకుల మయ్యెదము *మేమే మేమే*
చరణం: 4
నాన్న మాటలను వినెదము
అమ్మ వంటలనే తినెదము
చక్కగ కూర్చొని చదివెదము
హాయిగ నిదుర పోయెదము *మేమే మేమే*
No comments:
Post a Comment