Thursday, March 13, 2025

భీష్మ ఏకాదశి/మోక్ష ఏకాదశి

అంశం: *భీష్మ ఏకాదశి*


శీర్షిక: *మోక్ష ఏకాదశి*

మహా తేజస్వి
ఆజన్మ బ్రహ్మ చారి
అసమాన ప్రతిభా శాలి
గంగాశంతనుల అష్టమ పుత్రుడు
సత్సీలత కలిగిన ప్రతిభావంతుడు
భీష్మ పితామహుడు, కురు వంశం వృద్ధుడు!

సత్యవతికి మాట ఇచ్చిన మహా జ్ఞాని
తండ్రి వివాహం కొరకు, తన కళ్యాణం
త్యాగం చేసిన త్యాగి
మహ సభలో నుండిరి మౌన మునిగా
కురుక్షేత్రంలో చేసిరి యుద్ధం కౌరవుల పక్షాన
తప్పదన్నట్లుగ!

స్వయం మరణ వరం పొందిన యోగి
పార్థుడి భానాలకు నేలకొరగగా
పుణ్యకాలంలో మరణించాలనీ
దక్షిణాయనం నుండి ఉత్తరాయణం వరకు
అంపశయ్యపై యాబది ఎనిమిది రోజులు వేచి
మాఘ మాసం శుక్ల పక్ష అష్టమి రోజున
మరణిస్తాడు
దీని తదుపరి వచ్చు మొదటి ఏకాదశి అని
*భీష్మేకాదశి* అని , *జయ ఏకాదశి* అని,
*మహాఫల ఏకాదశి* అని కూడా పిలిచెదరు!

భీష్ముడు అంపశయ్యపై నున్న రోజులలో
శ్రీకృష్ణుడు పురికొల్పే యుధిష్ఠిరుడిని
భీష్ముడి అనుభవాలను తెలుసుకోమని
అందుకు సమ్మతించి,యుధిష్ఠిరుడు వెళ్ళగా
మూలుగుతూ నా వల్ల కాదు
శ్రీ కృష్ణుడిని చెప్ప మనెను
అందుకు శ్రీ కృష్ణుడు, మీ అనుభవాలు
నేను ఎలా చెప్ప గలనని , భీష్ముడికి
మాట్లాడే శక్తిని ప్రసాదించగా
అప్పుడు పితామహుడు, ధర్మజునికి
రాజనీతి బోధించాడు
అవియే సహస్ర నామాలుగా ప్రసిద్ధికెక్కినవి
భీష్మ ఏకాదశి రోజున ఎవరు సహస్రనామాలు
చదివినా,శ్రద్ధగా విన్నా ,భగవద్గీతను చదివినంత
తృప్తి కలుగుతుందని,
మోక్షం లభిస్తుందని,స్వర్గ ప్రాప్తి లభిస్తుందని ప్రతీతి

          

No comments: