అంశం: అంత్యాక్షరి
శీర్షిక: *ఆత్మయే పరమాత్మ*
*సాధించ గలవు కోరుకున్న లక్ష్యాన్ని విజయ తీరాన్ని*
ఆనందంగా జీవించ గలవు
అందుకు చక్కని క్రమ శిక్షణ ఉండాలి
కలలు కనాలి సాకారం చేసుకోవాలి
అంటారు అబ్దుల్ కలాం
నిరంతరం సాధన చేయాలి
పట్టుదలతో కృషి చేయాలి
*జన్మ సార్థకం చేసుకోవాలి*
అప్పుడే సమాజంలో గుర్తింపు ఉంటుంది
కుటుంబంలో సమాజంలో గౌరవం లభిస్తుంది
ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు
ఆత్మ సంతృప్తి ఉంటుంది
అంతకంటే మనిషికి కావలసింది ఏముంది?
*మంచి మనిషిగా చరించు*
ప్రేమ దయ కరుణ జాలి చూపించు
చక్కని వ్యక్తిత్వంతో జీవించు
ఆపదలో ఉన్న వారికి సేవలు చేయి
చేత నైతే ఆర్ధిక సహాయం చేయి
*నిర్వర్తించు మనిషిగా నీ కర్తవ్యం*
మహా మనీషిగా గుర్తింపు పొందు
జనులందరూ జేజేలు పలుకుతారు
గౌతమ బుద్ధుడిలా స్వామి వివేకానందునిలా
ప్రపంచ ఖ్యాతి గడించాలి
*నీ ఆత్మను నీవు గ్రహించు*
ఆత్మ బోధకు మించినది ఏముంటుంది
న్యాయ మూర్తులు ఆత్మబోధ ప్రకారమే తీర్పులిస్తారు
ఆత్మయే పరమాత్మ
ఆత్మయే పరబ్రహ్మము
No comments:
Post a Comment