Saturday, March 15, 2025

కృషితో నాస్తి దుర్భిక్షం

అంశం:చిత్ర కవిత


శీర్శిక: కృషితో నాస్తి దుర్భిక్షం

మనిషి ఏదైనా సాధించాలంటే
కలలు కనాలి నిరంతరం సాధన చేయాలి
దానిని సాకారం చేసుకోవాలి
అంటాడు డాక్టర్ అబ్దుల్ కలాం!

పదివేల అడుగుల ప్రయాణానికైనా
మొదటి అడుగుతోనే ప్రారంభించాలి
క్రమశిక్షణతో పట్టుదలతో దృడసంకల్పంతో
నిరంతరం కృషి చేస్తే విజయం సాధిస్తారు!

సంపాదనలోనూ క్రమశిక్షణతో
మెల్లమెల్లగా అభివృద్ధి సాధించాలి గానీ
అడ్డ దారిలో ఎదుగాలనుకుంటే
అదఃపాతాళంలో కూరుకుపోవల్సిరావచ్చు!

మొక్క ఒకే రోజు తాటిచెట్టు పొడుగు
పెరుగాలని కుండెడు నీరు పోసిన
చెట్టు ఎదుగడం కాదు
నీటిలో మునుగుతూ తేలుతూ
మురిగి పోతుంది మట్టిలో కలిసి పోతుంది!

*కృషితో నాస్తి దుర్భిక్షం* అన్నట్లు
సంకల్పంతో  పట్టుదలతో క్రమబద్ధంగా
నిత్యం కృషి చేస్తే  గెలుపు తధ్యం
విజయ పతాకాన్ని ఎగురవేయవచ్చు!

         

No comments: