Wednesday, March 12, 2025

యువత మేల్కన వలె

అంశం: యువత - దేశ భవిత


శీర్షిక: యువత మేల్కొన వలె

యువత భారత దేశ భవిత 
యువత మేల్కొన వలే

స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో 
యువత సారధులు రథ సారథులు
సుభాష్ చంద్రబోస్ అనిన మాటలు 
ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోవలే 
*పదివేల మంది యువతను నాకిస్తే* 
*ఒకే సంవత్సరంలో* 
*దేశానికి స్వాతంత్య్రాన్ని సిద్ధింపజేస్తాననే!*

స్వార్ధ రాజకీయ మార్జాల మందలు
యేలు తుండె నేడు నేల సందు బొందు 
పాడగునిక చూడు యువత భవిత
ప్రజలు మిన్న కుండె పగలు రాత్రి నేడు!

డ్రగ్గు బీరు దంద డాన్సు డాబాల్లోన 
అందు బాటు నుండె అదుపులేక
ఆగమవుతు యువత మూగబోయే 
కాలమేలనాపు కరుణ తోటి!

ఉచిత పథక మనుచు నుత్త హామీలిస్తు
నేత జెప్పు నెన్నొ నేర్పు గాను
బానిసలను జేయు బతుకవీలవకుండ
సీట్ల గెలుపు కొరకు నోట్లు పంచు!

సార దంద జేయు చక్కగా నేతలు
దొరక కుండ నిలన దొర్లు తుండే
భూమి కభ్జ జేసి బురిడి గొట్టిస్తుండ్రు
యువత నోరు మూసి భవిత మార్చే!

యువత మేల్కొనవలె భవిత మార్చుకొనను 
మాట మార్చు నట్టి మాయ గాండ్ల 
తరిమి కొట్టి చూడు నెరవక నికనైన 
భవిత యుండు రేపు యువత కొరకు!

చెత్త డిజిటల్ ను కొంత విడిచి 
జనుల చైతన్య పరుచాలి 
పెనుభూతమైన అవినీతిని 
దేశం నుండి సమూలంగా తరిమి కొట్టాలి! 

          

No comments: