అంశం: *తొలి ఏకాదశి*
శీర్షిక: *శయన ఏకాదశి*
స్థితి కారకుడు జగత్ రక్షకుడు శ్రీ మహా విష్ణువు
ఆషాఢ శుద్ఝ శుక్లపక్ష తిధి ఏకాదశి రోజు
శ్రీ లక్ష్మి నారాయణుడిని ఆరాధించు రోజు
కోట్లాది భక్తులజన్మ తరించు రోజు,
తొలిఏకాదశి!
దక్షణాయణంలో , ఆషాడ మాసంలో వచ్చే
శుద్ధశుక్ల పక్ష తిధియే ఏకాదశి, తొలిఏకాదశి, పేలాల ఏకాదశి
శ్రీ మహా విష్ణువు పాలకడలిలో శేష
శయ్యపై యోగనిద్రలోకి ఉపక్రమించి
చతుర్మాస శుక్లపక్ష ఏకాదశిన మేల్కొను
దీనినే శయన ఏకాదశి అని కూడా పిలిచెదరు!
ఏకాదశి అనగా పదకొండురోజులు
అవియే పంచేంద్రియాలు,పంచ కర్మేంద్రియాలు
ఒకటి అంతరేంద్రియం - మనసు
వీటిని నియంత్రించిన మనిషిజీవతం ధన్యం
తొలిఏకాదశి రోజునే ఇదిసాధ్యం! ఇదిసత్యం!
తొలి ఏకాదశి పర్వాన ఉపవాస ధీక్షతో
శ్రీ విష్ణుమూర్తిని శాల పూలు, ఫలములతో
ధూప దీపాలతో, చక్రపొంగలి నైవేద్యాలతో
సరి సంఖ్యలో ప్రదక్షణలు, సహస్ర
నామాలతో!
పసుపు పచ్చని పుష్పాలు, తులసి
మాలతో
మనసారా శ్రద్ధతో పూజించిన భక్తులకు
కలుగును సుఖఃశ్శాంతులు, అష్టైశ్వర్యాలు
తొలుగును సకల పాపాలు , కష్ట నష్టాలు!
ఏమీ వీలుకాని,అవకాశంలేని భక్తులు
ఉపవాస ధీక్ష చేస్తూ,నిష్ఠతో శ్రీ మహా
విష్ణువును ఓం నమోనారాయ ణాయ,
ఓం భగవతే విష్ణవే
అని పదకొండు సార్లు స్మరించిన చాలు
జీవితంధన్యమగు,తీరును కోరినకోరికలు
కలుగును యెన్నో పుణ్య ఫలములు!
No comments:
Post a Comment