Tuesday, March 11, 2025

ప్రజలు బంగారు బాతులు

 శీర్షిక: *ప్రజలు బంగారు బాతులు*


బి.పి షుగర్ ఎసిడిటీ ఉబ్బసం

గ్యాస్  అజీర్తి  క్యాన్సర్క్ష క్షయవ్యాధి 

దగ్గు జలుబు జ్వరం తలనొప్పి ఇన్ఫ్ ల్యూన్జా

వైరస్  చికెన్ గున్యా  డెంగ్యూ కరోనా 

మరేదైనా కావచ్చు

బిల్లుల కోసమో

ఆర్ధిక సంపాదన కోసమో

ఆకాశ హార్మ్యాల నిర్మించడం కోసమో

అవసరం లేని మందులు ఇచ్చి

కరోనా రోగులపై ప్రయోగాలు చేయకండి

ప్రజల ఆయుషు తీయకండి


పనికి రాని మందులు ఇచ్చి

లంగ్స్ పాడు చేయకండి

అవసరానికి మించి ఆల్ట్రాసౌండ్ తీసి 

కిడ్నీస్ పాడు చేయకండి

బ్లాక్ , వైట్ ఫంగస్ ల రానీయకండి

రోగ నిరోధక శక్తిని నాశనం చేయకండి

ఆక్సిజన్ అవసరాలు పెంచకండి

ప్రజలను పాడే నెక్కీయకండి


కార్పోరేట్ హస్పటల్స్ దేవుళ్ళారా!

ప్రజలు బంగారు బాతులు

రోజుకో బంగారు గుడ్డును తినండి

ప్రజలు బ్రతికుంటేనే మీకు ఆదాయం

మీరేమి సంపాదించినా ఇక్కడే వదలి పోవాలి 

రోగుల జీవిత ఆశలను ఆరనీయకండి

No comments: