Tuesday, March 4, 2025

గెలుపు తీరం చేరే తపన

అంశం: గెలుపు తీరం చేరే తపన


శీర్షిక: జీవిత లక్ష్యం చేరడం ఎలా?

*మనిషి అన్నపుడు గెలువగలగాలి*
*మాను అన్నపుడు నిలువగలగాలి*

ఎగిసిపడే కెరటం
సముద్రతీరం చేరాలనే తపనలా
చెరువు లోని తామర మొక్క
చెరువంతా విస్తరించాలనే తపనలా
మట్టిలో పెరిగే తమలపాకు మొక్క
లతలా పందిరిపై విస్తరించాలనే తపనలా
మనిషి గెలుపు కోసం తపించాలి
తన జీవిత లక్ష్యం చేరడానికి శ్రమించాలి!

గొంగళి పురుగు తన లక్ష్యం
సీతాకోకచిలుక గా మారడానికి
ఎన్ని దశలు మారుతుందో
ఎలా శ్రమిస్తుందో
ఎన్ని ఇక్కట్ల పాలవుతుందో
చివరికి ఎలా విజయం సాధిస్తుందో
అలా మనిషీ తాను విజయం సాధించడానికి
తపించి పోవాలి!

అందుకు కేవలం తపిస్తేనే కాదు 
అందుకు జీవితలక్ష్యం ఏర్పరుచుకో
గడువు నిర్ణయించుకో
క్రమశిక్షణ అలవర్చుకో
సమయపాలన పాటించు
అనుభవజ్ఞులను కలుస్తూ ఉండు
నైపుణ్యత పెంచుకో సాధన చేయి
వ్యక్తిత్వం పెంచుకో
ప్రతి విషయం నోటు బుక్ లో వ్రాసుకో
ఈర్ష్య అసూయ అహం కోపం తగ్గించుకో
ప్రతి ఒక్కరితో కలుపుగోలుగా మెదులుకో
పాజిటివ్ ఆలోచనలు చేస్తుండు
లక్ష్యం చేరేవరకు పట్టుదలతో ఉండు!

ఇలా చేసినను ఎవరైననూ
గెలుపు తీరం చేరడం సులభం 
జీవిత లక్ష్యం చేరడం తధ్యం! 

No comments: