Tuesday, March 4, 2025

సంకల్పం

అంశం: సంకల్పం


శీర్షిక: సంకల్పం సగం విజయం

*పదివేల అడుగుల దూరం ప్రయాణానికైనా*
*సంకల్పం అనే మొదటి అడుగే ప్రధానం*

*దేనికైనా సంకల్పమే సగం బలం*
*ఎప్పుడైనా సంకల్పమే సగం విజయం*

*మనిషి అన్నపుడు గెలువ గలగాలి*
*మాను అన్నపుడు నిలువ గలగాలి*

ఎగిసిపడే కెరటం
సముద్రతీరం చేరాలనే సంకల్పంలా
చెరువు లోని తామర మొక్క
కొలనంతా విస్తరించాలనే సంకల్పంలా
మట్టిలో పెరిగే సన్న జాజి మల్లె
లతలా పందిరిపై అల్లుకుపోవాలనే సంకల్పంలా
మనిషి గెలుపు కోసం తపించాలి
తన జీవిత లక్ష్యం చేరడానికి శ్రమించాలి!

గొంగళి పురుగు తన లక్ష్యం
సీతాకోకచిలుకగా మారడానికి
ఎన్ని దశలు మారుతుందో
ఎంతటి సంకల్పంతో ఉంటుందో
అనుక్షణం ఎలా శ్రమిస్తుందో
ఎన్ని ఇక్కట్ల పాలవుతుందో
చివరికి ఎలా విజయం సాధిస్తుందో
అలా మనిషీ తాను విజయం సాధించడానికి
సంకల్పంతో ముందుకు అడుగు వేయాలి!

అందుకు కేవలం సంకల్పిస్తేనే
గెలుపు తీరం చేరుతారా అంటే
కాదు లేదు అనే సమాధానమే వస్తుంది

విజయ సాధించాలంటే ఏమి చేయాలి?

అందుకు
జీవిత లక్ష్యం ఏర్పరుచుకోవాలి
గడువు నిర్ణయించుకోవాలి
క్రమశిక్షణ అలవర్చుకోవాలి
సమయపాలన పాటించాలి
అనుభవజ్ఞులను కలుస్తూ ఉండాలి
నైపుణ్యత పెంచుకోవాలి
సాధన చేయాలి
వ్యక్తిత్వం పెంచుకోవాలి
ప్రతి విషయం నోటు బుక్ లో వ్రాసుకోవాలి
ఈర్ష్య అసూయ అహం కోపం వంటి వాటిని
వదిలేయాలి
కామక్రోదమోహలోభ మధమాత్సర్యాలను
అరిషడ్వర్గాలను దూరం పెట్టాలి
ప్రతి ఒక్కరితో కలుపుగోలుగా ఉండాలి
పాజిటివ్ ఆలోచనలు ఉండాలి
లక్ష్యం చేరేవరకు పట్టుదలతో ఉండాలి!

ఇలా చేసినను
గెలుపు తీరం చేరడం విజయం సాధించడం
జీవిత లక్ష్యం చేరడం ఎవరికైనా సాధ్యమే!

No comments: