Saturday, March 8, 2025

కీ.శే. తాడూరి జనార్ధన్

కీ.శే. తాడూరి జనార్ధన్ గారికి శ్రద్ధాంజలి:


ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిలా
కలియుగంలో తాడూరి జనార్ధన్
ఇద్దరు తల్లుల ముద్దుల తనయుడు
పుట్టుక గజవెళ్ళి సుగుణమ్మ నాంపల్లి వారి ఇంట
పెంపకం తాడూరిసత్తెమ్మ లక్ష్మి నర్సింహా స్వామి వారి ఇంట
పుట్టింది గజవెళ్ళి వంశంలో
పెరిగింది తాడూరి వంశంలో

గోరు ముద్దలు తిన్న చిన్ని కృష్ణుడిలా
వెన్న తిన్న గోపాలిడిలా
అల్లారు ముద్దుగా పెరిగాడు
విద్యాబుద్ధులు నేర్చుకున్నాడు
వినయ విధేయతలు అలవర్చుకున్నాడు

ఇష్టసఖి  ఇందిరను నిష్టగా వివాహామాడి
ఒక కొడుకు ఒక కూతురుకు జన్మినిచ్చి
చక్కని వినయ విధేయతలు బోధించి
విద్యాబుద్ధులు నేర్పిన మహా జ్ఞాని
కీ.శే. తాడూరి జనార్ధన్ గారు

తల్లి దండ్రుల చేతిలో
అల్లారు ముద్దుగా పెరిగిన జనార్ధన్
అనారోగ్యంతో నాన్న
ఆ తరువాత  అనాధాశ్రమంలో అమ్మ
అనంత లోకాలకు వెళ్ళడంతో
అంధకారంలోకి వెళ్లి పోయాడు

సరియైన ఉద్యోగం లేకున్నా
సమయానికి జీతం రాకున్నా
తన బాధలను తనలోనే దిగమింగుతూ
అష్ట కష్టాలను తానే అనుభవిస్తూ
కంట తడి కనబడనీయకుండా
తన రెప్ప మాటున దాచుకుంటూ
కన్నీరుతో దాహం తీర్చుకుంటూ
అలసటను  కనబడ నీయకుండా
చెమటతో స్నానం చేస్తూ
అప్పుసప్పులు చేసి
కొడుకును కూతురును చక్కగా చదివించి
కూతురుకు ఘనంగా వివాహం జరిపించి
కొడుకును పై చదువులకు అమెరికాకు పంపించి
మనుమరాలును కళ్ళజూసి
అనంత లోకాలకు వెళ్లిపోయారు

సచ్చీలుడు , సద్గుణవంతుడు
సమర్ధుడు, సకల గుణ సంపన్నుడు
సేవాత్పరుడు , ఆపద్బాంధవుడు
అజాత శత్రువు అజరామరుడు
కీ.శే. తాడూరి జనార్ధన్ గారు

కుటుంబ సభ్యులతో
బంధు మిత్రులతో
ఉద్యోగ సహచరులతో
సత్సంబంధాలు , చక్కని గౌరవ మర్యాదలు
కలిగి యున్న గొప్ప మహామాన్వితుడు
కీ.శే. తాడూరి జనార్ధన్ గారు

కరోనా సమయంలో
తనకు ఏమైనా పర్వాలేదని
కుటుంబ సభ్యులకు దూరముంటూ
ఎంతో మంది కరోనా బాధితులను
రక్షించించిన , సేవలందించిన. ధైర్యాన్నిచ్చిన
కరోనా బాధితుల ఆపద్భాందవుడు
కీ.శే. తాడూరి జనార్ధన్ గారు

ఇంతటి గొప్ప మానవతావాది
మాన నీయుడు మహా మాన్వితుడు
ఈ రోజు మన మధ్య లేక పోవడం
ఎంతో బాధ కరం
ఇది కుటుంబ సభ్యులకు, బంధు మిత్రులకు
అనారోగ్యులకు తీరని లోటు
ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు
మనో ధైర్యాన్ని, ఆయురారోగ్యాలను
ఆర్ధిక శక్తిని కలిగించాలని భగవంతుడిని
వేడుకుంటున్నాను .

కీ.శే. తాడూరి జనార్ధన్ గారికి స్వర్గ ప్రాప్తి కలగాలని
శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.
మరణం తేది:24.02.25 సోమవారం రాత్రి 10.45 ని.లు. ఆటో ఆక్సిడెంట్ లో ORR HANAMKONDA.

No comments: