అంశం:సంకల్ప శక్తి
శీర్శిక: *పట్టుదల*
గాలికి దీపం పెట్టి దేవుడా అని మ్రొక్కుతూ
చూస్తుంటే దీపం ఆరిపోకుండా ఉంటుందా!
ఊడిన చేతి వ్రేలు ఉంగరం నదిలో జారిపోతే
దేవుడా అనిమ్రొక్కుతూ కూచుంటే
ఉంగరం దొరుకుతుందా!
ఏదైనా విజయం సాధించాలంటే మనిషిలో
ఆసక్తి తపన తాపత్రయం ఉండాలి
దానికి తగ్గట్టుగా క్రమశిక్షణ నిత్య సాధన
నిరంతర శ్రమ విషయసేకరణ ఉండాలి!
కలలు కనాలి వాటిని సాకారం చేసుకోవాలి
అంటారు డాక్టర్ అబ్దుల్ కలామ్
ఒక డాక్టర్ కావాలన్న కలలు కంటే సరిపోదు
దానికి ముందుగా డాక్టర్ అవుతానని
తనపై తనకు నమ్మకం విశ్వాసం ఉండాలి
బొద్దింకలను కప్పలను ఎలుకలను
పేషెంట్లను చూస్తేనే భయం అయితే
ఒకటి రెండు సార్లు ఆలోచించుకోవాలి
లేదు కాదూ డాక్టరే అవ్వాలన్నకోరిక ఉంటే
మనోధైర్యం సంకల్ప శక్తి ఉండాలి
ఎలాగైనా డాక్టర్ అవ్వాలనే *పట్టుదల*
ఆలోచన తపన ఉండాలి
ఆర్ధిక వనరులు చదువుకు పట్టేకాలంపై
పూర్తి అవగాహన కలిగి ఉండాలి
డాక్టర్ చదువుకై కొరకై నిరంతరం
కృషి చేయాలి
ఇలా ఇంజినీర్ అయినా ఐఏఎస్ ఐపిఎస్
ఐఆర్ ఎస్ ఐఇఎస్ ఏదైననూ
క్రమశిక్షణ *పట్టుదల* నిరంతర శ్రమ ఉంటే
విజయం నీడలా నీ వెంట బడుతుంది!
No comments:
Post a Comment