Wednesday, March 5, 2025

ఓటు వేయడం ఓటరు బాధ్యత P


అంశం: ఓటు వ్యాపారం

శీర్షిక: "ఓటు వేయడం ఓటరు బాధ్యత"

తళతళ మెరిసే ధవళ ఖద్దరు వస్త్రాలు
మెడలో రంగు రంగుల పార్టీల కండువాలు
చేతిలో ఐఫోనులు చుట్టూరా సెక్యూరిటీలు
గల్లలు ఎగరవేసుకుంటూ నేతలు!

"దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనీ"
రాజకీయ వ్యాపారంలో మేమేమి 
తక్కువా అన్నట్లుగా
రోజు రోజుకు నేతల వేషాలు రోత పుట్టిస్తుండే
చట్టాలు నేతలకు చుట్టాలుగా మారే!

మోసాలు చేసినా వేషాలు వేసినా
ఘోరాలు చేసినా నేరాలు చేసినా
అత్యాచారాలు చేసినా హత్యాచారాలు చేసినా
నక్షాలు మార్చినా భూ కబ్జాలు చేసినా
గూండా అయినా కేసులు పడినా
జైలు జీవితం గడిపినా హింసా వాదియైనా
వేలు ముద్ర పెట్టినా డెబ్బది యేండ్లు దాటినా
చనిపోయిన నేతల సానుభూతి ఓట్లతో
పోటీ చేసి గెలిచినా
గెలిచాక పార్టీలు పిరాయించినా
రిజర్వేషన్లను అడ్డం పెట్టుకొని పోటీ చేసినా
ఇచ్చిన హామీలను నెరవేర్చక పోయినా
ఎన్నికలలో డబ్బు పంచుతూ పట్టు బడినా
ఎన్నికల అఫిడవిట్ లో 
తప్పుడు సమాచారమిచ్చినా
అనేకమైన స్కాములలో కేసులు నడుస్తున్నా
జైలు శిక్షలు అనుభవిస్తూ జైలు నుండైనా
ఎన్నికలలో పోటీ చేసే అవకాశం, అధికారం
ఎన్నికల చట్టం కల్పించే!

భారతీయ పౌరుడిగా రాజ్యాంగ బద్ధుడిగా
ఓటర్లు ఓటువేయడం ఒక బాధ్యత, 
అవసరం కూడా లేదంటే అది నేరం!

ముగ్గురు పోటీ చేస్తే  ఆ ముగ్గురిలో ఒకరు
భూకబ్జాదారుడు, స్కామర్, అత్యాచారుడైనా
మెజారిటీ ఓటర్లు ఓటు వేసినా వేయక పోయినా
ఎవరో ఒకరు ఎన్నికవడం ఎన్నికల విధానంలో 
కొట్టొచ్చినట్టు కనబడే పెద్ద లోపం!

ఇది నేటి  మన ఎన్నికల వ్యవస్థ
దౌర్భాగ్య స్థితి  బహిరంగ రహస్యం కూడా 
*చట్టాలలో ఉన్న లొసుగులు అది రాజకీయ నాయకులకు ముసుగులు*!

రానున్న రోజుల్లో, ఓటు వేయకపోతే
లోపమెక్కడుందో తెలుసుకోకుండా 
ప్రభుత్వ సంక్షేమ పథకాలపై నియంత్రణ
విధించినా విధించవచ్చు
పేద మధ్యతరగతి ప్రజలకు అవి కూడా
పధకాలు పొందడం కష్ట తరం కావచ్చు
వ్యవస్థలు ఇలాగే కొనసాగితే 
భారత దేశం మరో వెయ్యేండ్లైనా
అభివృద్ధి చెందుతున్న దేశంగానే గుర్తిస్తారని
ఘంటాపధంగా చెప్పవచ్చు!

అయితే ఏమిటి దీనికి పరిష్కారం?
*ఐదేండ్ల కొకసారి, ఒక సంవత్సరం దేశంలో*
*రాష్ట్రపతి పాలన విధిస్తేనే, నేతల, బ్యూరో క్రాట్ల*
*వ్యాపారుల అవినీతి నియంత్రణలోకి వస్తుంది*.
*రేపు మరొకరు బినామీలతో*
*స్కాములు చేయడానికి భయపడుతారు*
*ఎన్నికలంటేనే వణికిపోతారు*
*పేద మధ్యతరగతి ప్రజలకు న్యాయం*
*జరుగుతుంది, దేశం అభివృద్ధి చెందుతుంది*

మరో స్వామి వివేకానందనో  సుభాస్ చంద్రబోసో సర్ధార్ పటేలో లాల్ బహదూర్ శాస్త్రి నో  జయప్రకాష్ నారాయణో  శ్రీ శ్రీ యో దాశరథియో  కాళోజీ యో 
జన్మించాల్సి రావచ్చు 
*వారు మీలోనే ఒకరై ఉండవచ్చు*

No comments: