Wednesday, March 5, 2025

ధర్మ చక్రం

అంశం: *ధర్మచక్రం*


శీర్శిక: *ధర్మ విధి చక్రం*

*ధర్మో రక్షతి రక్షితః*
ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది
*ధర్మం శరణం గచ్ఛామి*
ఇది బుద్దుడు ప్రతిపాదించిన సిద్ధాంతం

ప్రజలు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా
నీతిగా నిజాయితీగా నడుచుకోవడానికి
కాల చక్రంలా నిరంతరం కొనసాగడానికి
రూపొందించిన చక్రమే *ధర్మచక్రం*
ఇది ధర్మానికి న్యాయానికి ప్రతీక

ధర్మమనగా న్యాయమనియు,
చక్రమనగా కాలంలా స్వయంగా తిరుగుతూ
తన చలనాన్ని పూర్తి చేసి మల్లీ
తన గమనాన్ని ప్రారంభించేదని

బుద్ధుడు ఎనిమిది చువ్వలతో
*ధర్మచక్రం* నిర్మిస్తే

ఆ తరువాత వచ్చిన అశోక చక్రవర్తి
సువిశాలమైన మౌర్య సామ్రాజ్యాన్ని
పాలిస్తున్న తన పరిపాలనా కాలంలో
రాజధాని అయిన సారనాథ్ లో
ఒక ఎత్తైన స్తంభాన్ని నిర్మించాడు
దానినే అశోక స్తంభంగా పిలిచేవారు
ఆ స్తంభం పైభాగంలో చెక్కిస్తాడు ఒక చక్రాన్ని
అదియే *ధర్మ చక్రం*, *అశోక ధర్మ చక్రం*

ఆ తదుపరి దీనిలో కొన్ని మార్పులు చేసి
జాతీయ జెండాలో మధ్య భాగంలో నిలిపారు
అశోక ధర్మ చక్రంలో నీలి రంగులో
ఇరువది నాలుగు గీతలు/ఆకులు ఉంటాయి

వీటిని ఇరువది నాలుగు గంటలని
ఈ ఇరువది నాలుగు గంటలు
మనిషి నిరంతరం శ్రమించాలనీ ఒక భావ మైతే
అవి మనిషి నిత్యం నడుచుకోవాల్సిన
ముఖ్య విధులని మరొక అర్ధం గోచరిస్తుంది

బుద్ధుడు ప్రతిపాదించిన ఎనిమిది చువ్వల
*ధర్మచక్రం* అయినా
ఆ తరువాత మౌర్య సామ్రాజ్యాన్ని పాలించిన
అశోకుడు చెక్కించిన *ధర్మచక్రం* అయినా
మూల సిద్ధాంతాలు ఒకటే

ప్రతి భారతీయుడు, కుల మత వర్గ భాష
ప్రాంత భేదాలు లేకుండా , చిన్న పెద్దా
పేద ధనిక తారతమ్యం లేకుండా
అందరూ పాటించాల్సిన విధులు
సత్ప్రవర్తన, ఆరోగ్యం, శాంతి సామరస్యం
త్యాగం, నైతికత , సేవాభావంతో ఉండటం
క్షమాగుణం, ప్రేమ, స్నేహ భావం ఉండటం
సౌభ్రాతృత్వం, ఐక్యత, సంక్షేమం, శ్రేయస్సు
నీతి, న్యాయం, ధర్మం, దేశ రక్షణ
ఇలా ఇరువది నాలుగు విధులను
ధర్మచక్రం లోని గీతలు సూచిస్తాయి
అందుకే దీనిని *ధర్మ విధి చక్రం* అనవచ్చు
         

No comments: