అంశం: ఇదేనా అభివృద్ధి
శీర్షిక: *నాడు - నేడు*నాడు అది ఒక పల్లెటూరు పచ్చని వృక్షాలు
చల్లని వాతావరణంలో తేలియాడుతూ
అరుణోదయ వేళా , అల్లారు ముద్దుగా
చంటి బాబుకు సైకిల్ నేర్పిస్తూ!
ఆపై ఎదిగీ ఎదుగని ఆర్ధిక స్థోమతలు
డైనోరో టెలివిజన్లతో ఆనందాలు
ఇంటిల్లిపాదీ సాయంకాలం వేళా
సీరియల్లు చూస్తూ శ్రమను మరిచే!
అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానం
మొదలాయే డెస్క్ టాప్ కంప్యూటర్ల వాడకం
విద్యార్ధులకు ఏర్పడే నిత్యం వాటి అవసరం
తల్లిదండ్రులకు తప్ప దాయే వాటి వ్యయం!
నేడు అంత డిజిటలైజేషన్ మాయ
ఇక పెరిగింది చరవాణీల హవా
పేమెంట్లకైనా, పేకాటలకైనా చరవాణీలే
రేపు ఎటుపోతారో, ఏమైపోతారో జనం!
******
No comments:
Post a Comment