అంశం: రెప్ప పాటు జీవితం
శీర్షిక: *జీవితం నీటి బుడగ లాంటిది*
*జీవితం నీటి బుడగ లాంటిది*
*జీవితం గాలి బుగ్గ లాంటిది*
*రెప్పలుతెరిస్తే జననం రెప్పలుమూస్తే మరణం*
*జీవితం రెప్ప పాటు లాంటిది*
*క్షణికమైనది మనిషి జీవితం*
గాంధీజీని గాడ్సే పూలమాల వేస్తూ
ఇందిరా గాంధీని తన సెక్యూరిటే చంపారు
అబ్దుల్ కలామ్ స్పీచ్ ఇచ్చుకుంటూ
వైఎస్సార్ విమానదుర్ఘటనలో మరణించారు
ఊహించి ఉంటారా ఒక్క క్షణం ముందర
మనిషి దేవుడు ఆడే చదరంగంలో ఒక పావు
వైకుంఠ పాళీ ఆటలో ఒక పాచిక
త్రిమూర్తుల దృష్టిలో మనిషి ఒక జీవి
యమధర్మరాజు చేతిలో మనిషి ఆయుషు
ఈ ధరణిపై మనిషి ఒక ఆట బొమ్మ
ఈ జగతిలో మానవుడు ఒక రోబో
స్వార్థంతో నావాళ్ళు, నాబంధాలు అంటూ
ఈ నేల నింగి గాలి నీరు అగ్ని తనదే అంటూ
ఈ సంపదంతా తనదే అనుకుంటాడు
తమమతమేగొప్పదనీ తమకులమేగొప్పదనీ
తనవంశమేగొప్పదనీ తామే గొప్పవారిమనీ
తాము లేకుంటే ఈ జగతే లేదనీ
అహంభావంతో గర్వంతో విర్రవీగుతారు
తాము ఇంకా బ్రతకాలనుకుంటారు
ఆయుష్షు పెంచుకోవాలనుకుంటారు
ప్రాణాయామం యోగా ఎక్సర్సైజ్ చేస్తారు
ఆహార జీవన శైలిని మార్చేస్తారు
అందంగా ఉండాలనుకుంటారు
అంగవైకల్యం రాకుండా జాగ్రత్తపడుతారు
వృద్ధాప్యం రాకూడదని కోరుకుంటారు
ఆశలు కోరికలు తీర్చుకోవాలనుకుంటారు
ఏ క్షణంలో ఏమి అవుతుందో తెలియదు
ఏ నిమిషంలో ఏమి జరుగుతుందో తెలియదు
మనిషి జీవితం ఒక నీటి బుడగ లాంటిది
మనిషి జీవితం ఒక రెప్ప పాటు లాంటిది
నా అనే బదులు మన అనే భావనతో
కోపతాపాలు అహాలు మనఃస్పర్ధలు వదిలి
స్వార్ధం ఈర్ష్య అసూయ కామక్రోధాలు వీడి
దయ కరుణ జాలి దాన సేవా గుణాలతో
హంసలా ఐదేళ్ళు బ్రతికినా
ఆనందం తృప్తి ప్రశాంతత లభిస్తుంది
మోక్షం ప్రాప్తిస్తుంది
No comments:
Post a Comment