శీర్షిక: *మోసాల పుట్ట*
అది ఒక రాబంధుల కట్ట
అది ఒక భూకబ్జాల గుట్ట
అది ఒక పాపాల పుట్ట
అది ఒక శాపాల బుట్ట
అది ఒక మోసాల పుట్ట!
అందులో నివసిస్తాయి పాములు
నిత్యం బుసలు కొడుతాయి నాగులు
నిరుపేదలకు ఇస్తారు ఎన్నో హామీలు
సులభంగా దోచుకుంటారు భూములు !
అవసరాలతో కొందరు స్వాములు
చెంత చేరుతున్నారు మూగలు
కౌగిలించుకుంటున్నారు భాగ్యులు
వంత పాడుతున్నారు అభాగ్యులు !
ఒక్కొక్కరివి ఒక్కో అవసరాలు
చెంతన చేర్చు కుంటారు దొరలు
చేరుతుంటారు స్వార్ధపరులు
మర్చిపోతుంటారు దాష్టికాలు!
తోటి వారి మెప్పు కొరకు
సాటి వారి తృప్తి కొరకు
ఉనికి నిలుపుకునుట కొరకు
చితకముతక స్వార్ధం పనుల కొరకు!
జాతిని ఫణంగా పెడుతారా?
ప్రజల బానిసలను జేస్తారా?
వారసుల కొమ్ము కాస్తారా?
దొరల ముందు ప్రణమిల్లుతారా ?
ఎంతటి దాష్టికం
ఎంతటి దారుణం
ఎంత కాలమీ బానిసత్వం
ఇంకెంత కాలమీ మారణహోమం
ఆగేదెపుడు ఈ దోపిడి తత్వం
వదలాలి ప్రజలు జఢత్వం
వీడాలి యువతరం మూఢత్వం!
No comments:
Post a Comment