Monday, March 10, 2025

తెలుగు భాషాభ్యున్నతికి కవుల పాత్ర

శీర్షిక: తెలుగు భాషాభ్యున్నతికి కవుల పాత్ర

తెలుగు లోని తియ్యదనంతో
తెలుగు భాషలోని కమ్మదనంతో
తెలుగు ప్రజలలో ఉత్సాహంతో
కవులు పెరుగుతున్నారు క్షణం క్షణం
దేళ విదేశాలలో ఆన్ లైన్ వేదికలలో
కవి సమ్మేళనాలు జరుపు కుంటున్నారు
ఘనం ఘనం
విజృంభిస్తుంది తెలుగు సాహిత్యం!

రుబాయీలు  గేయాలు మణిపూసలు
ముత్యాల హారాలు మధురిమలు తొణుకులు
పదుల కొద్ది నూతన లఘుప్రక్రియలతో
వచన కవితలు ఆట వెలది సీస పద్యాలతో
కుల మత ప్రాంత భాషా భేదాలు లేకుండా
వాట్సాప్ సమూహాలతో
అలరిస్తుంది తెలుగు కవిత్వం!

చక్కని పదబంధాలు అలంకారాలు
ఉపమానాలు ప్రతీకలు వక్రోక్తులతో
తెలుగు భాషాభివృద్ధిలో
హావ భావాలతో హాస్య చలోక్తులతో
సమాజాన్ని చైతన్య పరుస్తూ
సమస్యలను ప్రభుత్వాలదృష్టికితెస్తూ
తెలుగు భాషాభ్యున్నతిలో
కవుల పాత్ర అనన్య సామాన్యమైనది!

నేడు తెలుగు భాష మూడు పువ్వులు
ఆరు కాయలు కాస్తుందంటే
అందుకు కారణం నాటి నేటి మేటి కవులేనని
గొప్పగా చెప్పడంలో అతిశయోక్తి లేదు
నన్నయ తిక్కన ఎర్రన పోతన, వేమన
సోమనాధుడు, గిడుగు గురుజాడ
గుర్రం జాషువా శ్రీ శ్రీ కాళోజీ  దాశరథీ సినారె
సిధారెడ్డి మొ.న ఎంతోమంది కవులు!

కవులలోనూ అనేక రకాలు
జంట కవులు, శివ కవులు  ప్రబంధ కవులు
పద్య కవులు, శతక కవులు
జాతీయోద్యమ కవులు, భావ కవులు
దిగంబర కవులు అభ్యుదయ కవులు 
విప్లవ కవులు వాగ్గేయకారులు!

కవులు ఇంకనూ గొప్పగా రాణించాలి
కవిత్వపు సొగసులు వెల్లివిరియాలి
తెలుగు భాషాభివృద్ధి జరుగాలి
ప్రపంచం నలుమూలలకూ తెలుగు భాష
తెలుగు సాహిత్యం విస్తరించాలి
అందుకు కవులు ప్రముఖ పాత్ర పోషించాలి!

No comments: