Sunday, March 9, 2025

పన్ను పన్ను పన్ను

అంశం: ప్రశ్న

శీర్శిక: పన్ను? పన్ను? పన్ను?

ఇంటిపై  పన్ను
పెట్రోల్ పై పన్ను
డిజిల్ పై పన్ను
అవినీతి నేతలపై ఏది పన్ను?

త్రాగే నీటిపై పన్ను
తినే తిండిపై పన్ను
త్రాగే సిగరెట్లపై పన్ను
అవినీతి సర్కారుపై ఏది పన్ను?

ఆల్కాహాల్ పై పన్ను
కార్మికులపై వృత్తి పన్ను
ఉద్యోగులపై ఆదాయ పన్ను
నేతల జీతాలపై ఏది పన్ను?

ఉద్యోగుల బోనస్ పై పన్ను
ఉద్యోగుల బత్యాలపై పన్ను
ఇతర ఆదాయాలపై పన్ను
నేతల ఇతర ఆదాయాలపై ఏది పన్ను?

వ్యాపారస్తుల ఆదాయాలపై పన్ను
ఆదాయపన్నులపై సర్ చార్జ్
ఆదాయపన్నులపై సెస్సు 
ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై ఏది సెస్సు?

టానిక్, మందుబిల్లలపై పన్ను
హాస్పిటల్ బిల్లులపై పన్ను
హాస్పిటల్ రూములపై పన్ను
సర్కారు అలసత్వంపై ఏది పన్ను?

ఆల్కాహాల్ పై టాక్స్
రహదారులపై టోల్ టాక్స్
వెహికిల్స్ పై టాక్స్
అక్రమ ఆర్జనపై ఏది టాక్స్?

రాంగ్ రూట్ లో వస్తే చలాన్
త్రాగి డ్రైవ్ చేస్తే చలాన్
ఆక్సిడెంట్ జరుగుతే చలాన్
ట్రాఫిక్ పోలీసుల అవినీతిపై ఏది చలాన్? 

వేహికిల్ రోడ్డుపై ఆగిపోతే ఫైన్
ఇన్స్యూరెన్స్ లేకపోతే ఫైన్
పొల్యూషన్ రషీదు లేకపోతే ఫైన్
రోడ్లు బాగుచేయించని సర్కారుపై ఏది ఫైన్?

నీటి బిల్లులపై పన్ను
కరెంట్ బిల్లులపై పన్ను
సినిమా టికెట్లపై పన్ను
చట్టాలను అమలు చేయకుంటే ఏది పన్ను?

కిరాణా షాపులపైనా పన్ను
ప్యాకింగ్ తో కూడిన ప్రతి వస్తువుపై పన్ను
ఇన్స్యూరెన్స్ ప్రీమియంపైనా పన్ను
నేతల పెన్సన్ల పై ఏది పన్ను?

పెట్టుబడులపై పన్ను
స్కూలు ఫీజులపై పన్ను
తినీతినక దాచుకున్న పొదుపుపై పన్ను
ప్రతి రూపాయి ఖర్చు పై పన్ను
నల్ల ధనంపై ఏది పన్ను?
భూకబ్జాలపై ఏది పన్ను?
బినామీల ఆస్తులపై ఏది పన్ను
నేతల ఉచిత సబ్సిడీలపై ఏది పన్ను
అమలు చేయని హామీలపై ఏది పన్ను?

 

No comments: