అంశం: సిగ్మాలు
శీర్షిక: సిగ్మాలు
మనుషులు *ఎందుకు* కలువలేక పోతున్నారు
మమతలు *ఎందుకు* దూరం అవుతున్నాయి
మనసు *ఏమిటి* విచిత్రంగా ప్రవర్తిస్తుంది
కోతి *ఏమిటి* అలానే విచిత్రంగా ఉంటుంది
జంతువులు *ఎలా* కలిసి మెలసి జీవిస్తున్నాయి
పక్షులు *ఎలా* వాటి భావాలను వ్యక్త పరుచు కుంటున్నాయి
దేశం *ఎప్పుడు* అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది
దేశంలో *ఎప్పుడు* సమానత్వం అమలవుతుంది
మనిషి *ఎక్కడ* స్వేచ్చగా జీవించగలడు
తరువు *ఎక్కడ* గొప్పగా పెరుగ గలదు
దేశంలో అవినీతిని *ఎవరు* నిర్మూలించ గలరు
దేశంలో అభివృద్ధిని *ఎవరు* సాధించగలరు
వ్యవస్థలు *ఇలా* ఎందుకు ఉన్నాయి
ప్రజలు *ఇలా* ఎందుకు అవస్థలు పడుతున్నారు
రాజ్యాంగం *చేత* వ్యవస్థలను మార్చలేరా
చట్టాల *చేత* అవినీతిని అరికట్టడం సాధ్యం కాదా
పాలకుల *వలె* ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు
నాయకుల *వలె* ప్రజలు ప్రవర్తిస్తారు
*అలా* ఉంటే దేశం అభివృద్ధి చెందుతుందా
*అలా* ఉంటే మనిషి అభివృద్ధి చెందుతాడా
No comments:
Post a Comment