అంశం: వలచి వచ్చిన వసంతం
శీర్షిక: *నవ వసంతం*
*వలచి* వచ్చిన వసంతం
కాదు కాదు *తలచి* వచ్చిన వసంతం
వయ్యారంగా *నడిచి* వచ్చిన వసంతం
శిశిరాన్ని *సాగనంప* వచ్చిన నవ వసంతం!
చిరు జల్లులను కురుపించ
తరువులను చిగురింప జేయ
పుడమిని పులకరింప జేయ
కోకిల మధుర స్వరాలకు స్వాగతం పలుక!
పచ్చని చీరలో సింగారించుకుని
కంటికి కాటుక పెట్టుకుని
నుదుట కుంకుమ పెట్టుకుని
మెడలో కంఠాభరణాలను ధరించి!
పిలువ కుండానే పిలిచి నట్లుగా
బుడి బుడి నడకలతో బుజ్జి బుజ్జి మాటలతో
మేఘాలతో సాన్నిహిత్యం పెంచుకున
వలచి వచ్చింది నవ వసంతం!
శిశిరం తరువుల ఎండుటాకులు రాల్చగ
వాయుదేవుడు వాటిని తరలించుకు పోగ
తుషార తుంపరలతో పుడమి చల్ల బడగ
వసంత హేళీ ఘనముగా నేల తల్లిని
ఆకుపచ్చని చీరెలా చిగురింప చేయవచ్చే
లోక కళ్యాణార్ధం రెండు నెలలు అవనిలో గడప!
No comments:
Post a Comment