అంశం: ఏం పట్టుకపోతావ్?
శీర్శిక: *మానవ సేవయే మాధవ సేవ*
మనిషి బండ రాయి కాదు
బండరాయికి ఉండదు గుండె కాయ...
గుండు రాయికి ప్రాణం ఉండదు
అందుకే అది కఠినంగా ఉంటుంది.
మనిషన్న వారికి ఉంటుంది మనసు
మనసున్న మనిషికి ఉంటుంది మానవత్వం
మానవత్వం లేని మనిషి మహిలోన
ఉన్నా
లేకున్నా ఒకటే ఒక్క క్షణమైన మనిషి సంఘజీవి
ఉంటాయి అవసరాలు ఒకరికొకరికి
పంచు కోవాలి బాధలు దుఃఖాలు
సుఖాలు సంతోషాలు ఇష్టాలు కష్టాలు
తీర్చాలి ఎవరికి చేతనైనంత శక్తికొలది
సృష్టిలో ఎవరూ శాశ్వతం కాదు
ఏదీ స్థిరత్వం కాదు జగతిలో
ఎంత గొప్పగ బ్రతికినా ఎంత సంపాదించినా
పోయేటప్పుడు నీ వెంట ఏమి రాదు తీసుకొని పోలేవు
ఆపదలో ఉన్నప్పుడు సాటి మనిషిపై
ప్రేమ దయ కరుణ
జాలి అనురాగం మమతానురాగాలు ఆర్ద్రత కనబరుచాలి
చేసే చిన్న సేవైనా ఆర్ధిక సహాయమైన
నిండు హృదయంతో చేయాలి
చిన్న సహాయం వలన తృప్తి కలుగుతుంది
చిన్న మేలు వలన మంచి భావం ఉంటుంది
చిన్న జాలి వలన గొప్ప ధైర్యం కలుగుతుంది
చిన్న దీపం వెలిగిస్తే ఇల్లంతా కాంతి ఉంటుంది
ఇంతకంటే కావాల్సింది ఏమిటి? పోయేటప్పుడు ఏమి తీసుకెళ్తాం?
*మానవ సేవయే మాధవ సేవ* అదే మోక్షానికి చక్కని త్రోవ
No comments:
Post a Comment