Wednesday, March 5, 2025

ఆశలను పూయిద్దాం

అంశం: ఆశలను పూయిద్దాం


శీర్షిక: *దురాశ దుఃఖానికి చేటు*

*ఆశ మనిషికి శ్వాస లాంటిది*
*ఆశ లేకుంటే మనిషికి భవిష్యత్తే లేదు*
*ఆశ లేకుంటే జగతిలో అభివృద్ధి జరుగదు*

మనిషికి ఆశ ఉండాలి
కానీ, అతి ఆశ కాకూడదు
అది అత్యాశ కాకూడదు
అలానే, దురాశ కాకూడదు

అత్యాశ స్వార్ధానికి హేతువు
దురాశ దుఃఖానికి చేటు
ఆశకు ఒక హద్దు ఉండాలి
ఆశ నియమంగా ఉంటే ఎంతో మేలు

త్రేతాయుగంలో
దాసి మంధర మాటలు విని
కైకేయి దురాశతో తన కొడుకు భరతుడిని
పట్టాభిషేకం కోరుతుంది
రాముడికి అరణ్యవాసం కోరుతుంది
భర్త దశరథుడి చావుకు కారణమైంది
చివరికి దుఃఖాల పాలయింది
చరిత్రలో విలన్ గా మిగిలి పోయింది!

ద్వాపరయుగంలో
శకుని దుర్బుద్ధితో మాయపాచికలేసె
రాజ్యాలను వశము చేసుకునే
దుర్యోధనుడు దురాశతో
ద్రౌపదిని వశము చేసుకున
వస్త్రాపహరణ గావించే
కురు వంశాన్నే కోల్పోయే!

No comments: