అంశం: అభిమానం
శీర్షిక: *అభిమానం ఒక అద్భుతమైన ఆయుధం*
మనిషి సంఘజీవి
మనిషి మనిషికి ఉంటాయి అవసరాలు
ఒకరిపై ఒకరు ఆధారపడి జీవించడం అనివార్యం
తాను జీవించినంత కాలమే కాకపోవచ్చు
తను గతించినా , తన ప్రభావం ఇతరులపై
కొనసాగుతూనే ఉంటుంది
బుద్ధుడు గతించి కొన్ని శతాబ్దాలు దాటింది
అయినా, ఇప్పటికీ పూజిస్తారు, ఆరాదిస్తారు
శ్రీ రాముడు, వివేకానంద, గాంధీ, వేమన
శ్రీ.శ్రీ, దాశరథి, ఎన్టీఆర్, ఘంటశాల, బాలు
ఇలా ఎందరో చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడినారు.
అందుకు కారణం వారి వ్యక్తిత్వం, మంచితనం
వారి సేవలు వారి నటనలు, వారి పాటలు
*అభిమానం ఒక విశిష్టమైన పదం*
*అభిమానం ఒక అద్భుతమైన ఆయుధం*
*ఎదుటి వారిపై ఇష్టం, గౌరవం, నమ్మకం*
*కలిగి ఉండటమే అభిమానం*
*అభిమానం, పొగడ్త ఎదుటివారిలో*
*ఉత్సాహం, ప్రోత్సాహం పెంచుతుంది*
*అభిమానం ఎదుటి వారికి శోభ నిస్తుంది*
*అదే అభిమానం అధికమైతే అనర్ధం*
అభిమానం తల్లిదండ్రులు పిల్లలపైనా
పిల్లలు తల్లిదండ్రుల పైనా, గురువులు పైనా
ఒకరిపైన ఒకరు చూపించుకుంటారు
గౌరవమైనా, అభిమనమైనా,నమ్మకమైనా
ఏదైనా శృతిమించకుండా జాగ్రత్తపడాలి
*అభిమానం ఒక విలువైన గౌరవం, వెలకట్టలేనిది*
*అభిమానం రెండు వైపులా పదునైన కత్తి లాంటిది*
కత్తితో పండు కోయవచ్చు, ప్రాణం తీయవచ్చు
అభిమానం ఎదుటి వారిపై చూపిస్తే
అది వారికి ఉత్సాహంగానూ
ప్రోత్సాహకంగానూ ఉండాలి
చూపిన వారికి , ఇంకనూ యావత్తు
జనబాహుళ్యానికి సంతోషం, ఆనందం
మేలు జరుగాలి
కొందరు కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు
గుడ్డిగా అవినీతి, భూకబ్జా,స్కాములలో నున్న
నాయకులపై తెగ అభిమానం పెంచుకుంటారు
పూల దండలు వేస్తారు, పాలాభిషేకం చేస్తారు
బినామీలుగా ఉంటారు ,
ఎక్కడంటే అక్కడ సంతకాలు పెడుతారు
నాయకులు స్కాములలో చిక్కుకుంటే
బినామీ అభిమానులు కూడా
శిక్షలను అనుభవించాల్సి రావచ్చు
దీనికి చదువు కొలమానం కాదు
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అతీతులు కారు
మరికొందరు స్వార్ధ దురభిమానులు ఉంటారు
ఎదుటి వారి బలహీనతలను ఆసరా చేసుకుని
*నక్క జిత్తులమారి వలె*
పొగుడుతూ, అభిమానం చూపిస్తూ
పబ్భం గడుపు కుంటారు
అభిమానం సదుద్దేశంతో అయితే
అది లక్షలు కోట్లాది మంది క్షేమం కోరేదైతే
మేలి బంగారంలా మెరిసి పోతుంది.
లేదంటే పాతపడిన ఇనుములా
తృప్పుపట్టి బానిసలుగా బ్రతకాల్సివస్తుంది
No comments:
Post a Comment