అంశం: అలకలు చల్లారిన వేళ
శీర్షిక: *మనసు తేలికవుతుంది*
*సైక్లోన్ వచ్చి వెలిశాక ఎలా ఉంటుందో*
*తుఫాన్ వచ్చి వెలిశాక ఎలా కనబడుతుందో*
*భూకంపాలు వచ్చి పోయాక నేల తల్లి ఎలా ఉంటుందో*
*యుద్ధాలు జరిగి విరమించుకున్నాక*
*ఆ ప్రాంతలో నిశబ్దంతో కూడిన ప్రశాంతత*
*ఎలా ఏర్పడుతుందో అలా ఉంటుంది*
*కుటుంబంలో వాతావరణం*
*అలకలు చల్లారిన వేళ*
కొట్లాటలు గొడవలు ద్వేషాలు కోపాలు
తాపాలు మనఃస్పర్ధలు ప్రతి కుటుంబంలో
సహజం.
కొట్లాటలు గొడవలు ద్వేషాలు కోపాలు
తాపాలు మనఃస్పర్ధలు తగ్గాక
"అయ్యో! నా వల్లనే ఈ గొడవ మొదలైందని,
ఇంత రాద్ధాంతం జరిగింది కదా అని ,
ఎవరి మనసులో వారు గిల్టీ ఫీలింగ్ తో
పాశ్చాత్తాపం చెందాక"
"అలకలు చల్లారుతాయి"
ప్రశాంతత ఏర్పడుతుంది
అప్పుడు, ఉషోదయాన
సూర్యుడి లేలేత కిరణాల్లా
నిశీథిని వీడిన జాబిలిలా!
అలకలు చల్లారిన వేళ !
మది కుదుట పడుతుంది
బయం వీడి పోతుంది
ధైర్యం పెకిలి వస్తుంది
మనసు తేలికవుతుంది
గుండె బరువు తగ్గుతుంది
హృదయం పులకించి పోతుంది
తలనొప్పులు మటుమాయం అవుతాయి
అనారోగ్యానికి కారణాలు తెలుస్తాయి
సమస్యలు అర్ధమౌతాయి
మనుష్యులు అర్ధమవుతారు
పరిస్థితులు అర్ధమౌతాయి
వెలకట్టలేని అనుభవాలు వస్తాయి
ఉదయించే సూర్యుడిలా జ్ఞానం వస్తుంది
ప్రపంచం కుగ్రామమై పోతుంది
చుట్టూరా పచ్చని వాతావరణం కనిపిస్తోంది
చల్లని వెన్నెల కురుస్తుంది
ఆకాశంలో ఇంద్రధనుస్సు మెరుస్తుంది
తీయని రాగాలు వినిపిస్తాయి
అంతా మనవారే అనిపిస్తుంది
అలకలు చల్లారిన వేళ
సమస్యలు పటాపంచలవుతాయి
ఆనందాల డోలలలో తేలియాడినట్లుంటుంది
No comments:
Post a Comment