శీర్షిక: కాలజ్ఞాని
తెల తెల్ల వారక ముందే వచ్చి చేరుతాయి
చెట్ల కొమ్మల పైన, పిట్ట గోడలపైనా వాలుతాయికావు కావు మంటూ బంధువుల రాకనో
బంధువులు పోకనో వినిపిస్తాయి
ఎంగిలి మెతుకులు పెట్టినా తిని వెళ్లి పోతాయి!
కానీ జనులు,
ఏమిటీ "కాకుల గోల" అని ఛీకొడుతారు
"పిల్ల కాకి" అని హేళన చేస్తారు
"కాకులను కొట్టి గద్దల కేస్తరా అని అంటారు
"కాకి కేమి తెలుసు ఉండీల దెబ్బ" అంటారు
"లోకులు పలు కాకులు" అని అంటారు !
కాకి నలుపని మనుష్యులకు పోల్చుతారు
"కాకిలా వెయ్యేండ్లు బ్రతికే కన్నా,
హంసలా ఐదేండ్లు బ్రతికినా చాలు" అంటారు
"కాకులు దూరని కారడివి" అని అంటారు
కాకి గురించి ఏమి తెలుసు నేడు జనులకు ?
కాకి ఒక ప్రాని
కాకి ఒక మహా జ్ఞాని
ప్రకృతి విపత్తులను ముందే
కనిపెట్టే ఒక భవిష్యవాణి
కాకి ఒక సమాచార వాహిని!
కాకి ఒక పిట్ట
అది శని దేవుని వాహనం
కాకులు పితృదేవతలతో సమానం
నచ్చిన వాళ్ళు రాకపోతే కాకులు ముట్టవు
పితృదేవుళ్ళ ఇష్టాలు తెలుసుకుంటారు
వారిని శత విధాల సంతృప్తి పరుస్తారు
కర్మల రోజు వారికిష్టమైనవి వడ్డిస్తారు
పిట్ట ముట్టకుంటే అసంతృప్తి చెందుతారు !
*కేక కేక* మధురమే కావచ్చు
కానీ,
*కాకి కేక కాకికే కాక కేకకా*
కాదు
*కాకి కేక కాకికే*
*కేక కేక కేకకే* మధురం!
No comments:
Post a Comment