Monday, March 10, 2025

కాకి కాలజ్ఞాని

అంశం: చిత్ర కవిత (కాకి)

శీర్షిక: *కాకి కాలజ్ఞాని*
(ప్రక్రియ: శిశిరాలు)

ఏమీ...!
*కావు కావు* అరుపులకు చీదరించుకుంటారు
*గబగబా* జనులు బయటకు వెళ్ళ గొడుతారు
*మల్లి మల్లి* రాకు అని చిరాకు పడుతారు
కాకి విపత్తుల పసిగట్టుననీ నమ్ముతారు!

ఆహా..!
*తెల్ల తెల్ల* వారక ముందే వచ్చి చేరుతాయి
*కొమ్మ కొమ్మ* ల  పైన బలేగా ఎగురుతాయి
*పిట్ట గోడ* లపైన మెల్లెమెల్లెగా వాలుతాయి
ఎంగిలి మెతుకులు పెట్టినా తిని వెళ్లి పోతాయి!

ఏమిటో..!
*కాకుల గోల* అంటూ అందరూ ఛీకొడుతారు
*గబగబా* వెళ్ళగొట్టి గడియ పెట్టుకుంటారు
*అవాక్కులు చివాక్కులతో* లతో గేలిచేస్తారు
కాకి శనిదేవుడి వాహనమన్నదే మరిచిపోతారు!

వావ్..!
*ముక్క బొక్క* కనబడితే చాలు కాకులరుస్తాయి
*కావు కావు* శాశ్వతం బంధాలని చెబుతాయి
*పైన పైన* తిరుగుతూ గమనిస్తుంటాయి 
బంధు మిత్రులను రమ్మని ఆహ్వానిస్తాయి!

అబ్బో..!
*వెంట వెంటనే* వరుసగ క్రమశిక్షణతో వస్తాయి
*గుంపులు గుంపులుగా* ఐక్యంగా ఉంటాయి
*వాటి వాటి* మంత్రాలను శ్రద్దతో జపిస్తాయి
చక్కగ పదార్థాలను నోట కరుచుకుని వెళ్తాయి!

అవునూ..!
*కాకి కాలజ్ఞాని* అది నల్లగున్నా నలుసుతిన్నా
*ప్రేమ దయ* ఉన్నవాళ్లు రాకపోతే అంటవు
*ఇష్టంగ తృప్తిగ* పెట్టకుంటే ఏవీ ముట్టవు
కాకులు ముట్టక పోతే మోక్షాలు లభించవు!

No comments: